
Viral: నాగ్‌పూర్ అల్లర్లకు, ఛావా సినిమాకు సంబంధం ఏంటి? దుమారం రేపుతోన్న నటి ట్వీట్లు
Viral: నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో స్వర భాస్కర్.
Viral: నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో స్వర భాస్కర్. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈమె ఎప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే సర్వ భాస్కర్ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. ఆమె పేరిట కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ట్వీట్లు తాను చేయలేదని, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని నటి క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఈ వివాదం ఏంటంటే.
నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు నటుడు విక్కీ కౌశల్, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ బాధ్యత వహించాలని స్వరా ఆరోపించినట్లు ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. మరో ట్వీట్‌లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యల కేసులో కునాల్ కమ్రాకు మద్దతు తెలిపినట్లు ట్రెండ్ అయ్యింది. దీంతో స్వర భాస్కర్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే ఈ ప్రచారంపై స్వర భాస్కర్ స్పందిస్తూ, తాను అలాంటి ట్వీట్లు చేయలేదని, అవి తన పేరుతో ఫేక్‌గా సృష్టించారని క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ, "ఇలాంటి ఫేక్ ప్రచారంలో కొందరు మించిపోతున్నారు. అసలు నిజాలు తెలుసుకోవాలి" అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇదే విషయంపై కొన్నిరోజుల క్రితం స్వరా భాస్కర్ ‘ఛావా’ సినిమా గురించి చేసిన ఒక ట్వీట్ కూడా వివాదాస్పదమైంది. అప్పట్లోనూ నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు.
అయితే స్వరా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనపై తనకు గౌరవముందని స్పష్టం చేసింది. ప్రజలను విభజించేందుకు చారిత్రక అంశాలను వాడకూడదని, ఎవరి మనోభావాలను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చింది. మొత్తం మీద ఇప్పుడీ అంశం ట్రెండ్ అవుతోంది.
Both these tweets being circulated by RW ecosystem are fake. Neither is tweeted by me. Pls check your facts everyone. @grok pic.twitter.com/dMEm0CWo05
— Swara Bhasker (@ReallySwara) March 25, 2025

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




