బిగ్‌బాస్‌ హోస్ట్‌గా చేయలేనని సమంత ట్విస్ట్?

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా చేయలేనని సమంత ట్విస్ట్?
x
Highlights

కరోనా కాలంలో కమర్షియల్‌ హంగులతో ప్రారంభమైన బిగ్‌బాస్ షో అహో ఓహో అనిపించింది. ఇప్పుడు షో రేటింగ్ పడుతూ లేస్తూ వస్తోంది. కానీ వీకెండ్ రాగానే బెస్ట్ రేటింగ్‌తో దుమ్ము రేపుతోంది.

కరోనా కాలంలో కమర్షియల్‌ హంగులతో ప్రారంభమైన బిగ్‌బాస్ షో అహో ఓహో అనిపించింది. ఇప్పుడు షో రేటింగ్ పడుతూ లేస్తూ వస్తోంది. కానీ వీకెండ్ రాగానే బెస్ట్ రేటింగ్‌తో దుమ్ము రేపుతోంది. ఇదంతా హోస్ట్ నాగార్జున పుణ్యమనే చెప్పాలి. మన్మధుడి స్టైల్, నాగ్ పంచ్‌లను ఆస్వాదించేందుకు ఆయన ప్రేక్షకులు టీవీలకు హత్తుకపోతున్నారు. కానీ నాగార్జున సడన్‌గా వైల్డ్ డాగ్ షూటింగ్‌ కోసం హిమాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడే 21 రోజులపాటు షూటింగ్ జరగనుంది.

మామ మాటకాదనకు కోడలు సమంత బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలను భుజాన వేసుకుంది. విజయదశమి రోజున బిగ్‌బాస్ వేదికపై మెరుపులా కనిపించి హుషారెత్తించింది సమంత. అవసరమైనప్పుడు పంచ్‌లు వేస్తూ.. చలకీగా మాట్లాడుతూ.. నవ్వుతూ నవ్విస్తూ కావాల్సినంత సందడి చేసింది స్యామ్. సమంత పర్ఫామెన్స్‌కి సోషల్‌మీడియాలో లైక్‌ల వర్షం పడింది. నాగార్జున వచ్చే వరకు సమంతే బిగ్‌బాస్‌ హోస్ట్ అని అంతా ఫిక్స్ అయ్యి రిలాక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు సమంత సడన్‌గా ట్విస్ట్‌ ఇచ్చింది. హోస్ట్ గా చేయలేనని కుండబద్దలు కోట్టేసిందని ప్రచారం జరుగుతోంది.

సమంత నో చెప్పడంతో బిగ్‌బాస్ హోస్ట్ ఎవరూ అనే సస్పెన్స్ మళ్లీ తెరపైకి వచ్చింది. కింగ్ నాగార్జున వీకెండ్ లో త్వరగా షూటింగ్‌ పూర్తి చేసుకొని స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ కు వస్తారట. బిగ్‌బాస్‌ షూటింగ్ పూర్తయ్యాక వెంటనే రీటర్న్‌ ఫ్లైట్‌ ఎక్కేస్తాడట. అయితే ఇదంతా కుదరదని మరోకరిని హోస్ట్‌గా దింపుతారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వీక్ హోస్ట్‌ ఎవరన్నది పెద్ద హైప్‌గా మారింది. పోనిలే ఈ రకంగానే బిగ్‌బాస్‌ షో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories