చైతూ బర్త్ డే : ఫ్యాన్స్ కి డబల్ ధమాకా

nagachaitanya
x
nagachaitanya
Highlights

అక్కినేని వారసత్వం పుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగచైతన్య..కూల్ గా సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. రేపు (...

అక్కినేని వారసత్వం పుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగచైతన్య..కూల్ గా సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. రేపు ( నవంబర్ 23) న పుట్టినరోజు జరుపుకుంటున్నాడు నాగ చైతన్య.. ఈ సందర్భంగా ప్రస్తుతం అయన నటిస్తున్న రెండు సినిమాల నుండి లుక్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి స‌ర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు మేకర్స్. .

ప్రస్తుతం నాగచైతన్య వెంకీమామ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్యతో పాటు వెంకటేష్ కూడా నటిస్తున్నాడు. అయితే ఇందులోని చైతూ పాత్రని పరిచ‌యం చేస్తూ ఓ టీజ‌ర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇందులో చైతూ కెప్టెన్‌ కార్తీక్ పాత్రలో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటు చైతూ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో చైతూ తెలంగాణా కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. నవంబర్ 23న ఉదయం 10.30 నిమిషాలకు ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రక‌టించారు. సో చైతూ పుట్టినరోజుకు ఫ్యాన్స్ కి డబల్ ధమాకా రాబోతుంది అన్నమాట..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories