
విజయ్ సేతుపతి, ఆర్. మాధవన్ ముఖ్య పాత్రలు పోషించిన 'విక్రమ్ వేద' సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్...
విజయ్ సేతుపతి, ఆర్. మాధవన్ ముఖ్య పాత్రలు పోషించిన 'విక్రమ్ వేద' సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, ఈ చిత్రంలో నారా రోహిత్ మరియు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నారు అని గత కొన్ని రోజులుగా పుకార్లు బయటకు వస్తున్నాయి. ఈ విషయం పైన వెంకీ అన్నయ్య సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం 'వెంకీ మామ' సినిమా తప్ప వెంకటేష్ ఇంకే సినిమాలు సైన్ చేయలేదని 'విక్రమ్ వేద' గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
అయితే విక్రమ్ వేద సినిమా బాగా నచ్చిన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ వార్త నిరాశ కలిగించింది. మరికొందరు మాత్రం మాధవన్ పాత్ర లో వెంకటేష్ సూట్ అయినప్పటికీ విజయ్ సేతుపతి పాత్రకి నారా రోహిత్ అంత న్యాయం చేయలేడేమో నని అభిప్రాయపడ్డారు. మరికొందరైతే అసలు అలాంటి సినిమాలను రీమేక్ చేయకుండా వదిలేయడం మంచిది అని అన్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి అయితే 'విక్రమ్ వేద' సినిమా రీమేక్ పట్టాలెక్కే సూచనలు లేవు. ఇక ముందు ఎవరైనా దర్శకుడు లేదా హీరోలు ఈ సినిమా రీమేక్ పై మొగ్గు చూపుతారో చూడాలి.
There is no truth in reports doing rounds in media that #VenkateshDaggubati garu is doing 'Vikram Vedha' Telugu remake. He is currently busy filming for #VenkyMama. The next films will be announced shortly. 😊
— Suresh Productions (@SureshProdns) May 7, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



