
Supritha: మా డబ్బులతో ట్రిప్పులకు వెళ్తే మీకేంటి నొప్పి?.. ఇచ్చి పడేసిందిగా..!
Supritha: సోషల్ మీడియాలో సెలబ్రిటీల లైఫ్ అంటే అందరికీ ఆసక్తే. కానీ అదే ఆసక్తి కొన్నిసార్లు విమర్శలుగా, ట్రోల్స్‌గా మారి వారిని మానసిక వేదనకు గురిచేస్తుంటాయి.
సోషల్ మీడియాలో సెలబ్రిటీల లైఫ్ అంటే అందరికీ ఆసక్తే. కానీ అదే ఆసక్తి కొన్నిసార్లు విమర్శలుగా, ట్రోల్స్‌గా మారి వారిని మానసిక వేదనకు గురిచేస్తుంటాయి. టాలీవుడ్ పాపులర్ నటి సురేఖావాణి గారాల పట్టి సుప్రిత ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగిన ఈ భామ, తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్‌పై సింహంలా గర్జించింది. తరచూ తన తల్లి సురేఖావాణితో కలిసి విదేశీ వెకేషన్లకు వెళ్లే సుప్రితపై కొందరు నెటిజన్లు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?, ఈ విలాసాలు అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించిన సుప్రిత, తనలోని ఆవేదనను,కోపాన్ని ముక్కుసూటిగా బయటపెట్టింది.
సుప్రిత దీనిపై మాట్లాడుతూ..నేను నా కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో మా అమ్మను వెకేషన్లకు తీసుకెళ్తున్నాను. ఒక కూతురు తన తల్లిని సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తుంటే, మీకెందుకు అంత కుళ్లు?" అని సూటిగా ప్రశ్నించింది. డబ్బుల గురించి ప్రశ్నించే వారికి సుప్రిత ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మేము ట్రిప్పులకు వెళ్తే డబ్బులు ఎక్కడివి అని అడుగుతారు. నేను పక్కాగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తాను. నా సంపాదనపై నాకు స్పష్టత ఉంది.మేమేదో వెళ్ళి లక్షలు లక్షలు తగలేయము. సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని మాత్రమే సరదా కోసం ఖర్చు చేస్తాం. లోకంలో అందరూ ట్రిప్పులకు వెళ్తారు, కానీ మా మీదనే ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదు.మొదట్లో ఇలాంటి కామెంట్లు చూసి చాలా ఏడ్చాను. కానీ ఇప్పుడు అర్థమైంది.. ఖాళీగా కూర్చుని కామెంట్స్ చేసే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని. నేను నా పని నేను చేసుకుంటానని చెప్పుకొచ్చింది.
సురేఖావాణి, సుప్రితల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఒక స్నేహితురాలిలా తన తల్లితో కలిసి ఉండటం, ఆమెను విదేశాలకు తీసుకెళ్లడం తప్పా? అని సుప్రిత నిలదీసింది. తమ వ్యక్తిగత జీవితంపై అనవసరంగా బురదజల్లే వారిని ఇకపై ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేసింది. సుప్రిత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చీలిపోయాయి. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. తల్లిని చూసుకోవడం కూతురి బాధ్యత, అందులో తప్పు పట్టాల్సింది ఏముంది? అని మద్దతు తెలుపుతున్నారు. హీరోయిన్‌గా పరిచయం కాకముందే ఇంతటి పరిణతితో, ధైర్యంగా మాట్లాడిన సుప్రితను చూసి ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




