logo
సినిమా

టీవీ ఛానెల్ పెట్టనున్న స్టార్ హీరో

టీవీ ఛానెల్ పెట్టనున్న స్టార్ హీరో
X
Highlights

ఇప్పటి వరకు రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు తమకంటూ ఒక ప్రత్యేకమైన టీవీ ఛానల్ ను పెట్టుకున్న విషయం...

ఇప్పటి వరకు రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు తమకంటూ ఒక ప్రత్యేకమైన టీవీ ఛానల్ ను పెట్టుకున్న విషయం తెలిసిందే. కాని ఈ జాబితాలో ఇప్పుడు ఒక స్టార్ హీరో జాయిన్ అవుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ బాలీవుడ్ స్టార్ ఒక టీవీ చానల్ ను స్థాపించారు. అతను ఎవరో కాదు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. కొన్నాళ్ల క్రితం సినిమా, టీవీ ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టిన సల్లు భాయ్ ఇప్పుడు ఏకంగా ఒక ప్రత్యేకమైన టీవీ ఛానెల్ నే ప్రారంభించబోతున్నాడు.

ప్రస్తుతం తన శాటిలైట్ ఛానెల్ లైసెన్స్ తీసుకునే పనుల్లో బిజీగా ఉన్నాడు సల్మాన్. అంతేకాక అందులో ప్రసారం చేసేందుకు తన పాత సినిమాల శాటిలైట్ హక్కుల్ని కూడా కొంటున్నాడని సమాచారం. ఈ ఛానెల్ కు 'ఎస్కె టీవీ' అని పేరు ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ ఛానెల్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. అంతేకాక సల్మాన్ ఖాన్ 'బీయింగ్ చిల్డ్రన్' అని ఒక ఫాషన్ లేబుల్ కూడా లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఇక సినిమాల ప్రకారం సల్మాన్ ఖాన్ త్వరలో 'భరత్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Next Story