అభిమాని కాళ్ళు పట్టుకున్న సూపర్ స్టార్.. కారణం తెలిస్తే గ్రేట్ అంటారు!

అభిమాని కాళ్ళు పట్టుకున్న సూపర్ స్టార్.. కారణం తెలిస్తే గ్రేట్ అంటారు!
x
Rajinikanth
Highlights

ఒక్కసారైనా రజినీని చూడాలని అనుకోని అభిమాని ఉండరు..కుదిరితే ఆయన కాళ్ళు పట్టుకోవాలని అనుకుంటారు కూడా ..

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారు ఉండరు. ఒక్కసారైనా రజినీని చూడాలని అనుకోని అభిమాని ఉండరు..కుదిరితే ఆయన కాళ్ళు పట్టుకోవాలని అనుకుంటారు కూడా .. కానీ అయన ఓ అభిమాని కాళ్ళు పట్టుకున్నాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే మరి..

ఇంతకీ జరిగింది ఏంటి?

కేరళ నుంచి వచ్చిన ప్రణవ్ అనే పెయింటర్ కి చేతులు లేవు , కానీ అద్భుతంగా పెయింట్ వేస్తాడు... అందులో భాగంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ పెయింట్ వేశాడు. అభిమాన హీరోని కలవడానికి వచ్చిన ప్రణవ్ ఆ పెయింట్ ని రజినీకి చూపించాడు. అతడి కళకి, అతడి అభిమానానికి ఫిదా అయినా రజినీ ఎమోషనల్ అయ్యాడు. అభినందిద్దాం అంటే ప్రణవ్ కి చేతులు లేకపోవడంతో రజినీ షేక్ హ్యాండ్ కాకుండా షేక్ లెగ్ ని తీసుకున్నాడు. అతనితో కలిసి కాసేపు గడిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక సూపర్ స్టార్ తాజాగా దర్బార్ అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి మురగదాస్ దర్శకత్వం వహించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories