ఒక ఛానల్ వాళ్ళు కావాలనే "సర్కారు వారి పాట" సినిమా ని బ్యాడ్ చేస్తున్నారని ఆరోపించిన కృష్ణ

Super Star Krishna Said One TV Channel Trying to Bad Sarkaru Vaari Paata Movie | Live News
x

ఒక ఛానల్ వాళ్ళు కావాలనే "సర్కారు వారి పాట" సినిమా ని బ్యాడ్ చేస్తున్నారని ఆరోపించిన కృష్ణ

Highlights

Super Star Krishna: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "సర్కారు వారి పాట"...

Super Star Krishna: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "సర్కారు వారి పాట". పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసుకొని ఈ సినిమా ఇప్పుడు 150 కోట్ల మార్కు వైపు దూసుకెళుతోంది.

తాజాగా ఈ సినిమా విజయం గురించి మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక సూపర్ హిట్ సినిమా అని చెప్పిన కృష్ణ పోకిరి దూకుడు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగుందని ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూశాక అందరికీ ఒక మంచి సినిమా చూశామని అనుభూతి కలుగుతుందని చెప్పిన కృష్ణ ఒక ఛానల్ వారు మాత్రం కావాలనే సినిమా బాగోలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

ఈ మధ్యనే కర్నూల్ లో చిత్ర బృందం సినిమా సక్సెస్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. మహేష్ బాబు తో పాటు కృష్ణ కూడా స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. ఇక మొట్టమొదటిసారిగా మహేష్ బాబు స్టేజి పైన డాన్స్ చేసి అభిమానుల మనసులను దోచుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories