సాహస వీరుడు కృష్ణ సినీ చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు

సాహస వీరుడు కృష్ణ సినీ చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు
x
super star krishna(File photo)
Highlights

సూపర్ స్టార్ కృష్ణ సాహసాలకు పెట్టింది పేరు. 55 ఏళ్ల సుదీర్ఘ చలనచిత్ర జీవిత ప్రస్థానంలో తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా.. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవల విలువను ఎవరూ మర్చిపోలేరు.

సూపర్ స్టార్ కృష్ణ సాహసాలకు పెట్టింది పేరు. 55 ఏళ్ల సుదీర్ఘ చలనచిత్ర జీవిత ప్రస్థానంలో తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా.. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవల విలువను ఎవరూ మర్చిపోలేరు. 1965 – మార్చి 31న విడుదలైన "తేనె మనసులు" చిత్రంతో వెండితెరపై పరిచయమైన కృష్ణ అతి తక్కువ కాలంలోనే తెలుగువారికి అత్యంత సన్నిహితమయ్యారు. 1965 లో తేనె మనసులు, కన్నె మనసులు, 1966 లో గూడచారి 116 ఇలా రెండేళ్లలో 3 చిత్రాలకు మాత్రమే పరిమితమైయ్యారు. కృష్ణ 1967 నుంచి ఉత్తుంగ తరంగంలా విజృంభించారు.1967లో కృష్ణ నటించిన ఏడు చిత్రాలు విడుదల కాగా 1968 లో 11, 1969 - 70 సంవత్సరాలలో 15 చిత్రాల చొప్పున చెందారు.

1967 నుంచి 1990 వరకు ఎటు చూసినా , ఎక్కడ చూసినా సూపర్ స్టార్ కృష్ణ పోస్టర్లు దర్శనమిచ్చేవి. అప్పటి కాలేజీ యూత్, పెద్దలు అందరికీ బాల్య స్మృతులుగా, గొప్ప జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కృష్ణ సినిమాలు, పాటలు, సాహసాలు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఏ హీరో, అందనంత ఉత్పాదకతను తెలుగు చిత్ర పరిశ్రమకు కృష్ణ అందించారు. పగలు రేయికి తేడా లేకుండా రోజుకు మూడు నాలుగు షిఫ్ట్ ల చొప్పున పనిచేసి నమ్ముకున్న నిర్మాతలకు లాభాల పంట పండించారు.

కృష్ణ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రాలు, అవి సాధించిన విజయాలు, అవి సృష్టించిన సంచలనాలు తెలుగు వారి మనసుల్లో శాశ్వత చారిత్రక ఘట్టాలుగా నిలిచిపోయాయి. పద్మాలయా సంస్థ స్థాపన ద్వారా దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ కి కృష్ణ తెచ్చిన గుర్తింపు, గౌరవం అనితర సాధ్యం. సౌత్ ఇండియా అంటే ముఖ్యంగా తెలుగు సినిమా అంటే బాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ ఆయన నెలకొల్పిన పద్మాలయా సంస్థ. తెలుగు ఇండస్ట్రీలో సినిమా తొలి సారిగా స్కోప్, 70 ఎం.ఎం., dts, వంటి ఎన్నెన్నో సాంకేతిక ప్రక్రియలను పరిచయం చేశారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, కౌ బాయ్, క్రైమ్ థ్రిల్లర్స్ వంటి అన్ని జోనర్ ఫిలిమ్స్ చేసి అద్భుత విజయాలు సాధించాయి.

ద్విపాత్రాభినయం 25 సార్లు, ఏడు సార్లు త్రిపాత్రాభినయం చేయటమే కాకుండా ప్రపంచంలో అత్యధికంగా 340కి పైగా చిత్రాలలో హీరోగా చేసిన ఘనత కృష్ణకి దక్కుతుంది. ఒకే హీరోయిన్ తో 48 చిత్రాలు చేయడం కూడా సూపర్ స్టార్ కృష్ణ పేరున రికార్డు ఉంది. విజయ నిర్మల హీరోయిన్ గా కృష్ణ 48 చిత్రాలు చేశారు. ఆ తరువాత జయప్రద హీరోయిన్ గా 47 చిత్రాలు చేశారు. 33 సినిమా లు శ్రీదేవితో చేశారు. స్నేహ కోసం , మొహమాటం కోసం 25కు పైగా చిత్రాలలో గెస్ట్ పాత్రల్లో నటించారు.

ఈ సందర్భంగా భారతీయ చలనచిత్ర రంగంలో రికార్డల రాజు పద్మభూషణ్ సూపర్ స్టార్ డాక్టర్ కృష్ణకు పుట్టిన రోజు hmtv శుభాకాంక్షలు తెలుపుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories