బన్ని సినిమానే నమ్ముకున్న సునీల్

sunil
x
sunil
Highlights

ఆ సినిమాలోని పాత్ర సునీల్ కి మళ్ళీ అవకాశాలను తెచ్చిపెడుతుంది అనుకుంటే అనుకునున్నంతగా ఆ పాత్ర పండలేదు. ఈ సినిమా తర్వాత

ఒక స్టార్ కమెడియన్ నుండి హీరోగా మారాడు సునీల్..కామెడీ ప్రాదాన్యత కథలు కాకుండా యాక్షన్ కథలను ఎంచుకొని ప్లాపులను చవిచూసాడు. ఆ తర్వాత హీరోగా సినిమాలు ఆపేసి మళ్ళీ తనకి అచోచ్చిన కమెడియన్ గానే లైఫ్ ని మొదలుపెట్టాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నీలాంబరి పాత్రలో నటించాడు.

ఆ సినిమాలోని పాత్ర సునీల్ కి మళ్ళీ అవకాశాలను తెచ్చిపెడుతుంది అనుకుంటే అనుకునున్నంతగా ఆ పాత్ర పండలేదు. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో నటించాడు. ఇక సునీల్ తెరపైన కనిపించి చాలా రోజులు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న 'అల వైకుంఠపురములో' అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో సునీల్ ఓ పుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో నటిస్తునట్టు సమాచారం.. త్రివిక్రమ్ సునీల్ కోసం పక్కాగా ఈ పాత్రను డిజైన్ చేసారని తెలుస్తుంది. ఈ సినిమాతో సునీల్ కి మళ్ళీ కామెడీ రోల్స్ వస్తాయని ఆశిస్తున్నాడాట.. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్ కి జోడిగా పూజా హేగ్దే నటిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories