logo
సినిమా

Gully Rowdy Review: సందీప్ కిషన్ "గల్లీ రౌడీ" సినిమా రివ్యూ

Sundeep Kishan Gully Rowdy Movie Review | Today Telugu Movie Review
X

"గల్లీ రౌడీ"  రొమాంటిక్ యాక్షన్ కామెడీ సినిమా (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు * తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించాడు సందీప్ కిషన్

Gully Rowdy Movie: ఏడాది యువ హీరో సందీప్ కిషన్ కి చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. సందీప్ కిషన్ హీరోగా మార్చ్ లో విడుదలైన "ఏ వన్ ఎక్స్ప్రెస్" మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత "వివాహ భోజనంబు" అనే వెబ్ ఫిల్మ్ నిర్మాతగా వ్యవహరించిన సందీప్ అందులో గెస్ట్ రోల్ లో కూడా కనిపించి అలరించాడు. తాజాగా ఇప్పుడు "గల్లీ రౌడీ" అనే ఒక రొమాంటిక్ యాక్షన్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకు ముందు సందీప్ నటించిన "తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్" సినిమాకి దర్శకత్వం వహించిన జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇవాళ అనగా సెప్టెంబర్ 17, 2021 న విడుదలైంది. మరి ఈ సినిమాతో సందీప్ ఎంతవరకు మెప్పించాడో చూసేద్దామా.

చిత్రం: గల్లీ రౌడీ

నటీనటులు: సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం: రామ్ మిరియాల, సాయి కార్తీక్

సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్

నిర్మాత: కొన వెంకట్, ఎమ్ వీ వీ సత్యనారాయణ

దర్శకత్వం: జీ నాగేశ్వర రెడ్డి

బ్యానర్: కొన ఫిల్మ్ కార్పొరేషన్, ఎమ్ వీ వీ సినిమాస్

విడుదల తేదీ: 17/09/2021

కథ:

వాసు (సందీప్ కిషన్) వాళ్ళ తాత గారు వెంకట్రావు (రాజేంద్రప్రసాద్) దగ్గర పెరుగుతాడు. పోయిన తన కుటుంబ పరువుని మళ్లీ నిలబెట్టడానికి రౌడీ గా మారతాడు వాసు. కానీ తమ పేరు మీద ఉన్న ఒకే ఒక్క ల్యాండ్ బాగా పలుకుబడి ఉన్న ఒక పెద్ద లోకల్ డాన్ రఘు నాయక్ (బాబీ సింహా) చేతికి చిక్కుతుంది. వాసు మరియు వెంకటరావు తమ ల్యాండ్ ని తిరిగి తీసుకోవడానికి ఏం చేశారు? అసలు రఘు నాయక్ ఆ పొలం ఎందుకు కావాలి అనుకుంటున్నాడు? చివరికి ఎవరు గెలిచారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

ఎప్పటిలాగానే తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించాడు సందీప్ కిషన్. కానీ ఈ సినిమాలో సందీప్ కి దక్కిన పాత్ర యావరేజ్ చెప్పుకోవచ్చు. రౌడీ పాత్ర అయినప్పటికీ సందీప్ కిషన్ ఒక మాస్ హీరోగా మాత్రం మెప్పించలేకపోయాడు. తన క్యారెక్టరైజేషన్ కూడా వీక్ గా ఉండడంతో సందీప్ పెద్దగా మెప్పించలేకపోయాడు. తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ నేహా శెట్టి తన పాత్రలో బాగానే అలరించింది. కొన్ని సన్నివేశాల్లో తన యాక్టింగ్ నాచురల్ గా లేకపోయినప్పటికీ పర్వాలేదు అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలాగానే పూర్తి స్థాయిలో తన పాత్రకి న్యాయం చేశారు. బాబీ సింహ నటన ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, పోసాని కృష్ణ మురళి కామెడీ ప్రేక్షకులను బాగానే నవ్విస్తుంది.

సాంకేతికవర్గం:

ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రం ఎలా ఉండాలో అన్నీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నప్పటికీ సినిమా బాగా రొటీన్ గా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. ఆఖరికి కామెడీ సన్నివేశాలు కూడా ఎక్కడో చూసినట్టు అనిపించటం సినిమాకి బాగా మైనస్ అయింది. మిగతా సినిమాలలో వర్కౌట్ అయిన పాయింట్లు అన్నీ కలగలిపి సినిమా తీసినట్టు అనిపిస్తుంది. నెరేషన్ విషయంలో కూడా దర్శకుడు ఎంప్రెస్ చేయలేకపోయాడు అని చెప్పుకోవాలి. చౌరస్తా రామ్ మరియు సాయి కార్తీక్ అందించిన సంగీతం బాగానే అనిపిస్తుంది. పాటల సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సుజాత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది.

బలాలు:

కొన్ని కామెడీ సన్నివేశాలు, ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలు, నటీనటులు

బలహీనతలు:

కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ గా ఉండటం, కొన్ని బోరింగ్ సన్నివేశాలు

చివరి మాట:

కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే నవ్వించినప్పటికీ చాలావరకు కథ మరియు నెరేషన్ అవుట్ డేటెడ్ గా ఉండడం తో ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేక పోతారు. దర్శకుడు ఎంటర్ టైన్ మెంట్ కు పెద్ద పీట వేసినప్పటికీ కథ బాలేదు. ఫస్ట్ హాఫ్ లో మాత్రమే కాకుండా సెకండ్ హాఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ మరియు కామెడీకి అంతే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. క్లైమాక్స్ కూడా బాగుంది. చివరిగా మాస్ కామెడీ నచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా బాగానే అనిపిస్తుంది.

బటన్ లైన్:

"గల్లీ రౌడీ" మాస్ కామెడీ తో బాగానే నవ్వించాడు.

Web TitleSundeep Kishan Gully Rowdy Movie Review | Today Telugu Movie Review
Next Story