త‌ల్లిదండ్రుల‌కి 90 ల‌క్ష‌ల‌ కారు

త‌ల్లిదండ్రుల‌కి 90 ల‌క్ష‌ల‌ కారు
x
sundeep kishan
Highlights

సందీప్ ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. హాకీ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.

టాలీవుడ్ యుంగ్ హీరోలలో సందీప్ కిషన్ ఒకరు.. కెమరామెన్ చోటా కే నాయుడు మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటిగా 'స్నేహగీతం, ప్రస్థానం' లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 'షోర్‌ ఇన్‌ ద సిటీ' అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాడు. ఇక మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.

శమంతకమణి, నిను వీడ‌ని నీడ‌ను నేనే చిత్రాలతో మంచి హిట్టు కొట్టిన సందీప్ తాజాగా జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెనాలి రామకృష్ణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒకే అనిపించాడు. అయితే సందీప్ తాజాగా తన త‌ల్లిదండ్రుల‌కి మంచి లగ్జ‌రీ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఈ 350డి కారును అందుకున్న సందీప్ అమ్మనాన్నలు కనకదుర్గ, పీఆర్పీ నాయుడు చాలా సంతోషించారు. ఈ కారు ధర సుమారు రూ.90 లక్షలు ఉంటుంది.

సందీప్ ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. హాకీ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories