logo
సినిమా

మెగా ప్రిన్సెస్ కోసం రౌడి బాయ్

మెగా ప్రిన్సెస్ కోసం రౌడి బాయ్
X
Highlights

ఈమధ్యనే 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగా ప్రిన్సెస్ నిహారిక తాజాగా 'సూర్యకాంతం' సినిమాతో...

ఈమధ్యనే 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగా ప్రిన్సెస్ నిహారిక తాజాగా 'సూర్యకాంతం' సినిమాతో త్వరలో మనముందుకు రాబోతోంది. ప్రమోషన్ కార్యక్రమాలతో జోరుగా సాగుతున్నాయి. హీరో రాహుల్ విజయ్ తో కలిసి లు కాలేజీలకు వెళ్లి అక్కడ స్టూడెంట్స్ ని కలుస్తూ సినిమాకు ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు సాయంత్రం 'సూర్యకాంతం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రాబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది.

మెగా ఫ్యామిలీకి విజయ్ దేవరకొండ కి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలిసిందే. జీఎ2 బ్యానర్ లో 'గీత గోవిందం'.. 'ట్యాక్సీవాలా' సినిమాలను చేయడంతో మెగా ఫ్యామిలీతో బంధం బలపడింది. అందుకే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడని సమాచారం. విజయ్ దేవరకొండ రాకతో ఈ కార్యక్రమం మరింత ఆసక్తికరంగా మారుతుందనడం అతిశయోక్తి కాదు. సుహాసిని ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో కనిపించనుంది. మార్క్ రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రణీత్ బీ. దర్శకత్వం వహిస్తున్నారు. మార్చ్ 29 న ఈ చిత్రం విడుదల కానుంది.

Next Story