రాజీవ్ తో గొడవలు నిజమే.. విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ..

Suma Kanakala Talks about her Family At Alitho Saradaga | Telugu Movie News
x

రాజీవ్ తో గొడవలు నిజమే.. విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. 

Highlights

రాజీవ్ తో గొడవలు నిజమే.. విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ..

Suma Kanakala: ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ యాంకర్లలో సుమ పేరు ముందే ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ల నుంచి రియాలిటీ షోల వరకు దాదాపు బుల్లి తెర మొత్తం అన్ని షోలలో సుమనే కనిపిస్తుంది. తాజాగా ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా వెళ్ళిన సుమా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.

"గతంలో నీకు రాజీవ్ కి గొడవలు అయ్యాయని మీరు విడివిడిగా ఉంటున్నారని వార్తలు వినిపించాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది" అని అలీ అడగగా, "గొడవలు అయ్యాయి అనేది వాస్తవమే. ఈ 23 ఏళ్లలో ఎన్నో గొడవలు అయ్యాయి కానీ ఒకటి మాత్రం నిజం. భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం చాలా సులభం కానీ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం చాలా కష్టం" అని చెప్పుకొచ్చారు సుమ.

అయితే ఈ విషయంపై సుమ ఏం చెప్పారు అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. మరోవైపు చాలా కాలం తర్వాత సుమ "జయమ్మ పంచాయతీ" అనే సినిమాతో మళ్లీ వెండి తెరపై కనిపించనున్నారు. విజయ్ కుమార్ కలివరపు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. కీరవాణి సుమతో ఈ సినిమాలో ఒక రాప్ కూడా పడినట్లుగా అలీ షోలో తెలిపారు సుమ.

Show Full Article
Print Article
Next Story
More Stories