Sulthan: ఫస్టాఫ్ ఫన్ రైడ్ 'సుల్తాన్' ట్విట్టర్ రివ్యూ

Sultan Twitter Review ...
x

సుల్తాన్:(ఫైల్ ఇమేజ్)

Highlights

Sulthan: పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సుల్తాన్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది.

Sultan: హీరో కార్తి రష్మిక మందాన జంటగా దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కించిన చిత్రం 'సుల్తాన్'. బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సుల్తాన్‌'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై యష్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, యస్‌.ఆర్‌.ప్రభు నిర్మించారు. తెలుగు మరియు తమిళ బాషలలో విడుదలైన సుల్తాన్ ప్రీమియర్స్ షో టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం....

కథాంశం..

సుల్తాన్ మూవీ కథ విషయానికి అందమైన తన గ్రామాన్ని చేజిక్కించుకోవడానికి వచ్చిన రౌడీ మూకలపై ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు చేసే పోరాటమే సుల్తాన్ మూవీ. బలమైన ఆ ప్రత్యర్థులను ఒంటరిగా ఆ యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు. చివరికి ఆ దుర్మార్గులను నుంచి తన గ్రామాన్ని, కుటుంబాన్ని, ప్రజలను ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా కథ. సుల్తాన్ మూవీ పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో దర్శకుడు తెరకెక్కించాడు. ఫైట్స్, సాంగ్స్, ఎమోషన్స్, కామెడీ వంటి కమర్షియల్ అంశాలు కలగలిసిన అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా సుల్తాన్ ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కార్తిపై తెరకెక్కిన పోరాట సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

కార్తీ తన మార్కు నటనతో ...

'సుల్తాన్' ఫస్టాఫ్ మొత్తం ఫన్ రైడ్ అని చెబుతున్న ఆడియన్స్, ఈ సినిమాలో చూపించిన సీన్స్ పాతవే అయినా మంచి మసాలా మూవీ అనే ఫీలింగ్స్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ప్లస్ అవుతాయని, సినిమా చాలా బాగా వచ్చిందని టాక్ వస్తోంది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ఆసక్తికరంగా చూపించారని, ఆన్ స్క్రీన్‌పై కార్తీ- రష్మిక కెమిస్ట్రీ అదిరిందని పేర్కొంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఈ మూవీ ఓ ఫండ్ అండ్ ఎమోషనల్ రైడ్ అని అంటున్నారు. ఇక స్టార్ హీరోయిన్ రష్మిక మందాన డెబ్యూ తమిళ్ సుల్తాన్. పల్లెటూరి అమ్మాయిగా సరికొత్త రశ్మికను సుల్తాన్ మూవీలో చూడవచ్చు. ఆమె గత చిత్రాలకు భిన్నంగా సుల్తాన్ మూవీలో పాత్ర ఉంది. కార్తీ, రష్మికల కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.

లాల్ సినిమాకు మంచి సప్పోర్ట్...

ఇక కీలక రోల్స్ చేసిన మళయాళ నటుడు లాల్ సినిమాకు మంచి సప్పోర్ట్ ఇచ్చారు. నెపోలియన్, యోగిబాబు, సతీష్, హరీష్ తమ నటనతో మెప్పించారు. కామెడీ, ఎమోషన్స్ మరియు మాస్ సన్నివేశాలు తెరకెక్కించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే కథలో ఎటువంటి కొత్తదనం లేదు. గతంలో మనం చూసిన అనేక మాస్ కమర్షియల్ సినిమాల సమాహారంగా సుల్తాన్ ఉంటుంది. వివేక్-మెర్విన్ అందించిన సాంగ్స్ పర్వాలేదు. యువన్ శంకర్ రాజా బీజీఎమ్ ఆకట్టుకుంది.

పాజిటివ్ టాక్...

సుల్తాన్ మూవీ చాలా వరకు పాజిటివ్ టాక్ అందుకుంటుంది. సుల్తాన్ లోని మాస్ కమర్షియల్ అంశాలు ప్రేక్షకులు బాగానే నచ్చినట్లు తెలుస్తుంది. ప్రీమియర్స్ టాక్ బాగానే ఉన్న నేపథ్యంలో సుల్తాన్ మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం కలదు. ఖైదీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తీ..సుల్తాన్ తో ఏ మేర విజయం అందుకుంటాడో తెలియాలంటే మరికొంత సమయం వేచివుండాలి. కొవిడ్‌ వల్ల వచ్చిన ఒత్తిడి 'సుల్తాన్‌' సినిమా చూస్తే పోతుంది. యాక్షన్‌, ప్రేమ, వినోదం.. ఇలా అన్నీ వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు మూవీ చూసినవారు.

Show Full Article
Print Article
Next Story
More Stories