మెగా ప్రిన్సెస్ తో పనిచేయనున్న సుకుమార్

మెగా ప్రిన్సెస్ తో పనిచేయనున్న సుకుమార్
x
Highlights

ఈ మధ్యకాలంలో సుకుమార్ పేరు దర్శకుడిగా నిర్మాతగా ఎక్కువసార్లు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది 'రంగస్థలం' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న...

ఈ మధ్యకాలంలో సుకుమార్ పేరు దర్శకుడిగా నిర్మాతగా ఎక్కువసార్లు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది 'రంగస్థలం' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు సుకుమార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆ సినిమా గురించి పక్కన పెడితే సుకుమార్ నిర్మాతగా బోలెడు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తన శిష్యులను దర్శకులుగా మారుస్తూ సుకుమార్ నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీస్ మరియు శరత్ మరార్ లతో కలిసి కొన్ని సినిమాలను నిర్మించనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం సుకుమార్ తన మరొక శిష్యుడిని దర్శకుడిగా మారుస్తూ మళ్ళీ తాను నిర్మాతగా మారనున్నాడు. అసలు కథలోకి వెళితే నిహారిక కోసం ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్టును సిద్ధం చేసుకున్నాడు సుకుమార్. తన శిష్యులతో కలిసి ఇప్పుడు ఆ సినిమాను తెరకెక్కించనున్నాడు. గీత ఆర్ట్స్ 2 మరియు అంజనా ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా సుక్కు ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'సూర్యకాంతం' సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది నిహారిక. ఈ సినిమా విడుదలైన తర్వాత సుకుమార్ నిర్మాణంలో సినిమా పట్టాలెక్కనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories