Jr NTR-Sukumar: ఎన్టీఆర్ సినిమా లో జోక్యం చేసుకుంటున్న సుకుమార్

Sukumar is Interfering in Jr NTR Movie | Telugu Movie News
x

Jr NTR-Sukumar: ఎన్టీఆర్ సినిమా లో జోక్యం చేసుకుంటున్న సుకుమార్

Highlights

Jr NTR-Sukumar: ఎన్టీఆర్ సినిమా కోసం సుకుమార్ ని ఫాలో అవుతున్న బుచ్చిబాబు

Jr NTR-Sukumar: సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన బుచ్చిబాబు "ఉప్పెన" సినిమాతో డైరెక్టర్ గా మారారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు రెండవ సినిమాతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక కబడ్డీ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సినిమా అంతా 1980 నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబు ఈ సినిమాకోసం సుకుమార్ మార్కును దాటి బయటకు రాలేక పోతున్నారట. సుకుమార్ కి తన సినిమాలో హీరో కి ఏదో ఒక లోపం పెట్టడం అలవాటైపోయింది. అవే తన సినిమాలలో హైలైట్ కూడా అవుతున్నాయి. దీంతో బుచ్చిబాబు కూడా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒక లోపం పెట్టారట. అదేంటి అనే విషయం ఇంకా తెలియకపోయినప్పటికీ అది స్వయంగా సుకుమార్ ఇచ్చిన సలహానే అని తెలుస్తోంది. ఆ లోపం తోనే హీరో క్యారెక్టరైజేషన్ కి బాగా వెయిట్ పెరిగిందని ఎన్టీఆర్ ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపిస్తారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories