Sudheer Babu: స‌రికొత్త లుక్‌లో సుధీర్ బాబు.. పోస్టర్ అదిరిపోయిందిగా

Sudheer Babu Upcoming Movie
x

Sudheer Babu: స‌రికొత్త లుక్‌లో సుధీర్ బాబు.. పోస్టర్ అదిరిపోయిందిగా

Highlights

Sudheer Babu Upcoming Movie: విభిన్నమైన కథలు, భారీ మాస్ ఎంటర్టైనర్లకు పేరు తెచ్చుకున్న పాన్ ఇండియా బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, తాజాగా తమ 51వ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది.

Sudheer Babu Upcoming Movie: విభిన్నమైన కథలు, భారీ మాస్ ఎంటర్టైనర్లకు పేరు తెచ్చుకున్న పాన్ ఇండియా బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, తాజాగా తమ 51వ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించనున్న ఈ చిత్రానికి ఆర్‌ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను టి.జి. విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించనున్నారు.

ఇప్పటికే విభిన్నమైన కథలు, పాత్రల ఎంపికలో సుధీర్ బాబు ప్రత్యేకతను చాటుకున్నారు. కొత్తగా, విభిన్నంగా ఉండే కథలకే ఓటేస్తూ వస్తున్నారు. ఈ ట్రెండ్ కొనసాగిస్తూ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారికంగా ప్రకటించడంతో అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్‌గా మారింది.

అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తినిక పెంచేసింది. ఈ పోస్టర్‌లో సుధీర్ బాబు చొక్కా లేకుండా కనిపించారు. శరీరం నిండా గాయాలతో చేతిలో ఓ శక్తివంతమైన ఆయుధంతో మెట్టమెక్కుతూ ఈ ఫొటోలో కనిపిస్తున్నాడు సుధీర్ బాబు. చుట్టూ పడి ఉన్న శవాలు, మెరుపులతో కమ్మిన ఆకాశం ఈ సినిమా గంభీరతను, మైండ్‌సెట్‌ను ముందుగానే హింట్ ఇస్తున్నాయి.

ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కనుంది. "A Broken Soul On A Brutal Celebration" అనే ట్యాగ్‌లైన్‌ సుధీర్ బాబు పాత్ర ఎమోషనల్‌గా, లోతుగా ఉండబోతోందన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఇక ఈ సినిమాలోనూ సుధీర్ బాబు తన ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో మళ్లీ ఆకట్టుకుంటున్నారు. ఫిట్‌నెస్ పరంగా బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. పాత్ర కోసం దాదాపు శరీరాన్ని మలచుకున్నట్టు తెలుస్తోంది.

తారాగణం:

సుధీర్ బాబు

సాంకేతిక బృందం:

నిర్మాతలు: టి.జి. విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

దర్శకుడు: ఆర్‌ఎస్ నాయుడు

పీఆర్‌ఓ: వంశీ-శేఖర్

Show Full Article
Print Article
Next Story
More Stories