సీక్రెట్‌గా దిల్ రాజు రెండో పెళ్లి ?

సీక్రెట్‌గా దిల్ రాజు రెండో పెళ్లి ?
x
దిల్ రాజు ఫైల్ ఫోటో
Highlights

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేశాయి. అయితే దీనిపై దిల్ రాజుతో సహా అయన సన్నిహితులు...

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేశాయి. అయితే దీనిపై దిల్ రాజుతో సహా అయన సన్నిహితులు కూడా ఆ వార్తలను ఖండించలేదు. దీంతో ఈ వార్తల్లో నిజం ఉందనే అందరూ అనుకుంటున్నారు. అభిమానుల్లో కొందరికి ఎవరికీ ఓ క్లారిటీ మాత్రం రాలేదు.

తాజాగా దిల్ రాజు రెండో పెళ్లిపై ఇప్పుడు ఎవరికీ తెలియకుండా గప్‌చుప్‌గా జరిగిందన్న ఓ వార్తలు వచ్చాయి. పెళ్లి ఎక్కడ జరిగింది, రెండో భార్య ఎవరు అనే విషయం మాత్రం ఇంత వరకు బయటకు రావడం లేదు. ఫోటోలు కానీ , పెళ్లికి సంబంధించిన విషయాలు కానీ బయటకు రాలేదు.

కానీ, దిల్ రాజు పెళ్లి షాద్‌ నగర్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. విమానాశ్రయానికి షాద్ నగర్ దగ్గరగా ఉండటంతో దిల్ రాజ్ అక్కడ పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. దిల్ రాజు పెళ్లి విషయమై ఎవరు అధికారికంగా ప్రకటనలు మాత్రం చేయడం లేదు. కాగా.. మూడేళ్ల క్రితం నిర్మాత దిల్ రాజు భార్య అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు. వీరికి ఒక కూతురు కాగా ఆమెకు పెళ్లి అయిపోయింది. దీంతో ఒంటరిగా ఉంటున్న దిల్ రాజులు పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు సలహాలు ఇచ్చారని, అందుకే ఆ వైపు ఆలోచించి దిల్ రాజు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

దిల్ రాజు తన సొంత వెంకటేశ్వర ప్రొడక్షన్ హౌస్ తన సినిమాలకు భార్య పేరునే ముందుగా వేస్తుంటాడు. కాగా.. ఫ్యామీలీలోని 30 ఏళ్ల మహిళని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. దిల్ రాజు ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత 'జాను' తో ఫీల్ గుడ్ మూవీని నిర్మించారు. నాచురల్ స్టార్ నాని 'వీ' సినిమాతో రానున్నాడు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'పింక్' రీమేక్ కు తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దిల్ రాజు రెండో పెళ్లిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories