స్టార్ డైరెక్టర్ కొడుకు సినిమా కోసం రంగంలోకి దిగిన యు.వి.క్రియేషన్స్

Star directors son enters the field for the movie UV Creations
x

 స్టార్ డైరెక్టర్ కొడుకు సినిమా కోసం రంగంలోకి దిగిన యు.వి.క్రియేషన్స్

Highlights

UV Creations: *చోర్ బజార్ బృందం తో చేతులు కలిపిన యు.వి.క్రియేషన్స్

UV Creations: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తాజాగా ఇప్పుడు "చోర్ బజార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గెహనా సిప్పి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. "జార్జిరెడ్డి" వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఐ వీ ప్రొడక్షన్స్ పతాకంపై వి ఎస్ రాజు ఈ సినిమాని నిర్మించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ వారు కూడా తమ సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. హైదరాబాద్ లో "చోర్ బజార్" గురించి తెలియని వారు ఉండరు. ఎక్కడైనా ఏదైనా భారీ విలువ చేసే వస్తువు పోతే అది చివరికి దొరికేది చోర్ బజార్ లోనే.

ఈ నేపథ్యంలోనే ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కించనున్నారు జీవన్ రెడ్డి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ మరియు పాటలు సినిమా పై మంచి అంచనాలను కలిగేలా చేశాయి. ఇక సీనియర్ నటి అర్చన ఈ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో మంచి ఆదరణ అందుకుంది. సునీల్, సుబ్బరాజు, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ఈనెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories