Top
logo

Allu Arjun New Movie: అల్లు అర్జున్ తదుపరి సినిమా రేసులో స్టార్ డైరెక్టర్లు

Star directors in line for Allu Arjuns next
X

అల్లు అర్జున్

Highlights

Allu Arjun New Movie: సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న సినిమా 'పుష్ప'.

Allu Arjun New Movie: సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న సినిమా 'పుష్ప'. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప విడుదల కానుంది.

అల్లు అర్జున్ కోవిడ్ -19 పాజిటివ్ గా తేలడంతో.. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఆగిపోయింది. కాగా, బన్నీ తదుపరి ప్రాజెక్ట్ పై ఊహాగానాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మెగా నిర్మాత అల్లు అరవింద్ కూడా బన్నీ కోసం తదుపరి ప్రాజెక్ట్ ను ఖరారు చేసేందుకు పలువురు చిత్రనిర్మాతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇప్పటికే కొరటాల శివతో తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. కానీ ఈ చిత్రం ఆలస్యం అవుతోంది. కాబట్టి, స్టైలిష్ స్టార్ ఇటీవలే దర్శకుడు వేణు శ్రీరామ్‌ను కలిశారు. పవన్ కళ్యాణ్ తో వేణు శ్రీరామ్ తీసిన 'వకీల్ సాబ్' బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. చాలాకాలంగా పెడింగ్‌లో ఉన్న ఐకాన్ సినిమా గురించి వకీల్ సాబ్ డైరెక్టర్ తో చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మొదలవతుందని ఇటీవల దిల్ రాజు వెల్లడించారు. కాబట్టి, బన్నీ త్వరలో ఐకాన్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. మరోవైపు, అల్లు అర్జున్ తదుపరి సినిమా కోసం కేజీఎఫ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Web TitleStar directors in line for Allu Arjun's New Movie 2021 | Allu Arjun New Movie Director
Next Story