సినిమాకి ముందే ఎన్టీఆర్ ను కలిశాను అంటున్న ప్రశాంత్ నీల్

Star Director Prashanth Neel Says He is NTR Fan for 20 Years | Tollywood News
x

సినిమాకి ముందే ఎన్టీఆర్ ను కలిశాను అంటున్న ప్రశాంత్ నీల్

Highlights

*సినిమాకి ముందే ఎన్టీఆర్ ను కలిశాను అంటున్న ప్రశాంత్ నీల్

Prashanth Neel: "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కరియర్ మారిపోయింది. అప్పటిదాకా కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిచయం ఉన్న ప్రశాంత్ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారిపోయారు. కేవలం కన్నడలో మాత్రమే కాక "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్ అయిన "కే జి ఎఫ్: చాప్టర్ 2" గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా "సలార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ప్రశాంత్ కొన్ని ఆసక్తి కరమైన కామెంట్లు చేశారు.

"నేను గత 15 20 ఏళ్లుగా ఎన్టీఆర్ కి వీరాభిమానిని. ఇప్పటికే స్క్రిప్ట్ మొదలవ్వక ముందే సరదాగా మేము 10 నుంచి 15 సార్లు కలిశాము" అని అన్నారు ప్రశాంత్ నీల్. ఇక గత కొంతకాలంగా ప్రశాంత్ తన తదుపరి సినిమా కోసం ఎన్టీఆర్ ను రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టే ముందే ప్రశాంత్ ఎన్టీఆర్ ను పది నుంచి పదిహేను సార్లు కలిసి వచ్చానని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories