"సర్కారు వారి పాట" నేపథ్య సంగీతం షురూ చేసిన తమన్...

SS Thaman Started Background Music Work for Sarkar Vaari Paata | Mahesh Babu | Keerthy Suresh
x

"సర్కారు వారి పాట" నేపథ్య సంగీతం షురూ చేసిన తమన్...

Highlights

SS Thaman: తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ కూడా మంచి ఆదరణ అందుకుంది...

SS Thaman: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన "కళావతి" మరియు "పెన్నీ" పాటలు యూట్యూబ్ లో బాగానే వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ కూడా మంచి ఆదరణ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన నేపథ్య సంగీతం పనులు మొదలుపెట్టారు తమన్. ఇదే విషయాన్ని తమన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిత్ర డైరెక్టర్ పరశురామ్ తో కలిసి ఉన్న ఒక ఫోటో ని షేర్ చేస్తూ, 24/7 చిత్ర బీజీఎమ్ కోసం పని చేస్తున్నట్లుగా తెలిపారు తమన్.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సముద్రఖని ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 12న విడుదల కానుంది అని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories