SS Thaman: "రాధే శ్యామ్ సినిమా చాలా రోజులు ఆడుతుంది" అంటున్న థమన్

SS Thaman: "అందుకే రాధే శ్యామ్ సినిమా ఒప్పుకున్నాను" అంటున్న థమన్

admin1
Updated on: 7 Feb 2022 1:45 PM IST
SS Thaman Said that Radhe Shyam Movie Will be Playing for Many Days
X

SS Thaman: "రాధే శ్యామ్ సినిమా చాలా రోజులు ఆడుతుంది" అంటున్న థమన్

SS Thaman: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. జనవరి 14 న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోన కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని మార్చి 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని ఎస్.ఎస్.తమన్ నేపథ్య సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా థియేటర్లలో చాలా రోజులు నడుస్తుందని ఇది ఒక చక్కటి ప్రేమకథ అని చెప్పుకొచ్చారు.

"నిజంగా ప్రేమ అనేది ఉంటే.. ఆ ప్రేమ స్వచ్ఛమైనది అయితే.. రాధేశ్యామ్ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఈ సినిమాని వేరే లెవెల్ లో తీశారు. నేను జీవితంలో సినిమాలు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యువి క్రియేషన్స్ వారు మహానుభావుడు, భాగమతి వంటి సినిమాలు ఇచ్చి నాకు ఊపిరి పోశారు. అందుకే "రాధే శ్యామ్" సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఆ రెండు సినిమాల వల్లే నాకు రెండవసారి జీవితం మొదలైనట్లు అనిపించింది. చాలా ప్రాజెక్టులు వచ్చాయి. నేను "రాధే శ్యామ్" సినిమాకి ఇంత రెమ్యూనరేషన్ కావాలి అని అడగలేదు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకున్నాను" అని చెప్పుకొచ్చారు థమన్.

admin1

admin1

Next Story