"రాజా డీలక్స్" కోసం రంగంలోకి దిగిన తమన్...

SS Thaman Going to Direct Music for Prabhas Raja Deluxe Movie | Maruthi | Live News
x

"రాజా డీలక్స్" కోసం రంగంలోకి దిగిన తమన్...

Highlights

Raja Deluxe: ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే...

Raja Deluxe: ఈ మధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో డిజాస్టర్ ను అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ను అనుకుంటున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినమాలో మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం సెట్స్ ను తయారు చేస్తోంది చిత్రబృందం.

ఇక ఈ సినిమాని ఆగస్టులో లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు మారుతి ఈ సినిమా కోసం మరొక టైటిల్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కొత్త టైటిల్ ఏంటి అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం కట్టుబడి నేపథ్య సంగీతం కట్టిపడేసే విధంగా ఉండాలి. మరి తమన్ సంగీతం ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో "సలార్" మరియు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే" సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories