Aakashavaani: రాజమౌళి మెచ్చిన 'ఆకాశవాణి' ట్రైలర్ చూశారా..!

SS Rajamouli Unveils Teaser of Aakashavaani Movie
x

ఆకాశవాణి ట్రైలర్

Highlights

Aakashavaani: నటుడు సముతిరాకని, విజయ్ వర్మ, తేజ కాకుమను, ప్రశాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆకాశవాణి.

Aakashavaani: నటుడు సముతిరాకని, విజయ్ వర్మ, తేజ కాకుమను, ప్రశాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ఆకాశవాణి. ఈ చిత్రాన్ని ఏయు మరియు ఐ స్టూడియోస్ బ్యానర్ లో పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే అశ్విన్ గంగరాజు ఇంతకుముందు స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ డిపార్ట్ఖ‎‌మెంట్ లో పనిచేశాడు. అశ్విన్ కు ఆకాశావణి తొలి సినిమా.

తాజాగా రాజమౌళి ఆకాశవాణి టీజర్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అడవిలో ఓ అందమైన గ్రామం. ఆ గ్రామంలో నివసించే ప్రజలు, సంతోషంగా ఆడుకుంటున్న పిల్లలు..చాలా అందంగా చూపించారు. అయితే..హఠాత్తుగా ఓ అడివి మనిషిని చూసి భయాందోళనకు గురవుతున్నట్లు విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఇలాంటి అంశాలతో టీజర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఎంఎం కీరవాణి కుమారుడు కాలా భైరవ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రసిద్ధ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ రాయగా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories