RRR Update: బిగ్ సర్ప్రైస్ కోసం డేట్ ఫిక్స్ చేసుకున్న "ఆర్ ఆర్ ఆర్" చిత్రబృందం

SS Rajamouli RRR Movie Team is Going to Announce Big Update on 29th October 2021
x

RRR Update: అతిపెద్ద సర్ప్రైస్ కోసం డేట్ ఫిక్స్ చేసుకున్న "ఆర్ ఆర్ ఆర్" చిత్రబృందం

Highlights

RRR Movie Update: భారీ అనౌన్స్మెంట్ తో షాకివ్వనున్న "ఆర్ ఆర్ ఆర్" బృందం

RRR Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" (RRR) సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. "బాహుబలి" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో "ఆర్ ఆర్ ఆర్" కూడా ఒకటి.

అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తో రొమాన్స్ చేయనుండగా, కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ కనిపించనుంది.

ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదాలు పడుతూ వస్తోంది. నిజానికి ఈ సినిమా జూలైలోనే విడుదల కావాల్సింది ఆ తరువాత అక్టోబర్ అనుకున్నారు కానీ ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 29న చిత్ర బృందం ఒక భారీ అనౌన్స్మెంట్ చేయబోతోందట.

సినిమాకి సంబంధించిన ఈ అప్డేట్ సినిమా ప్రేమికులందరికీ గేమ్ చేంజర్ కాబోతోందని తెలుస్తుంది. మరి ఆ అతి పెద్ద ఎనౌన్స్మెంట్ ఏంటి అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories