logo
సినిమా

SS Rajamouli: అలియా భట్ కోసం రంగంలోకి దిగిన రాజమౌళి

SS Rajamouli to present Brahmastra Movie
X

హిందీ సినిమాని ప్రెసెంట్ చేస్తున్న రాజమౌళి(ట్విట్టర్ ఫోటో) 

Highlights

SS Rajamouli: హిందీ సినిమాని ప్రెసెంట్ చేస్తున్న రాజమౌళి

SS Rajamouli: జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉంది. తెలుగులో మాత్రమే కాక పరభాషలో కూడా సినిమా విడుదల కాబోతుండడంతో చిత్ర బృందం అన్ని భాషలలోనూ ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తోంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరగబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం "ఆర్ ఆర్ ఆర్" సినిమా ని మాత్రమే కాక రాజమౌళి మరొక సినిమాని కూడా ప్రమోట్ చేయనున్నారట.

ఆ సినిమానే "బ్రహ్మాస్త్ర". రన్బీర్ కపూర్ మరియు ఆలియాభట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. నాగార్జున కూడా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తన సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన ఆలియా కోసం రాజమౌళి స్వయంగా ఈ సినిమాని తెలుగులో మాత్రమే కాక మిగతా సౌతిండియన్ భాషల్లో కూడా ప్రెజెంట్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

Web TitleSS Rajamouli Attended to Brahmastra Movie Promotions
Next Story