Sriwass: ఎన్టీఆర్ సినిమా ఒప్పుకుని ఉంటే మహేష్ బాబు రెండు సినిమాలు వచ్చేవి కాదా?

Sriwass About Mahesh Babu Movies
x

Sriwass: ఎన్టీఆర్ సినిమా ఒప్పుకుని ఉంటే మహేష్ బాబు రెండు సినిమాలు వచ్చేవి కాదా? 

Highlights

Sriwass: "అదే జరిగి ఉంటే మహేష్ బాబు రెండు సినిమాలు వచ్చేవి కాదు," అంటున్న డైరెక్టర్

Sriwass: 2017లో గోపీచంద్ హీరోగా నటించిన "లక్ష్యం" సినిమాతో డైరెక్టర్ గా మారిన శ్రీ వాస్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెదా, లౌక్యం వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన శ్రీ వాస్ తాజా ఇప్పుడు మళ్లీ గోపీచంద్ హీరోగా రామబాణం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కి సిద్ధమవుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని శ్రీ వాస్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ శ్రీ వాస్ 2018 లో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేశారని కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదని ఒకవేళ అదే అయి ఉంటే మహేష్ బాబు రెండు సినిమాలు అసలు వచ్చేది కాదని అన్నారు శ్రీవాస్. వివరాల్లోకి వెళితే 2015 లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్ మీద వచ్చిన "శ్రీ మంతుడు" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే శ్రీ వాస్ ఈ కాన్సెప్ట్ తో 2008 లోనే సినిమా చేయాలని అనుకున్నారట. అదే కాన్సెప్ట్ ఉన్న ఒక కథని ఎన్టీఆర్ కి కూడా వినిపించారట. కానీ ఎన్టీఆర్ అప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పడంతో శ్రీ వాస్ ఐదు నెలలు స్క్రిప్ట్ మీద పనిచేసి ఎన్టీఆర్ కి ఫైనల్ నెరేషన్ ఇచ్చారట. కానీ ఎన్టీఆర్ ఈ కాన్సెప్ట్ తనకి సెట్ అవ్వదు అని నో చెప్పారట. "ఒకవేళ 2008 లోనే ఆ సినిమా పూర్తయి విడుదల అయ్యుంటే మహేష్ బాబు శ్రీమంతుడు మరియు మహర్షి సినిమాలు వచ్చేవి కాదు," అని అన్నారు శ్రీ వాస్. ఇక "రామ బాణం" సినిమాతో శ్రీ వాస్ ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories