పవన్ కళ్యాణ్ ఫార్ములాని వాడనున్న శ్రీనివాస్ అవసరాల

Srinivas Avasarala Is Using Pawan Kalyan Formula
x

 పవన్ కళ్యాణ్ ఫార్ములాని వాడనున్న శ్రీనివాస్ అవసరాల

Highlights

* పవన్ కళ్యాణ్ బాటలో వెళ్ళనున్న శ్రీనివాస్ అవసరాల

Srinivas Avasarala: నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ అవసరాల డైరెక్టర్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. "ఊహలు గుసగుసలాడే", "జో అచ్యుతానంద" వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ అవసరాల తాజాగా ఇప్పుడు నాగశౌర్య హీరోగా "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" అనే ఆసక్తికరమైన సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ మరియు పద్మజా దాసరి నిర్మించిన ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందించారు. మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య లతోపాటు శ్రీనివాస్ అవసరాల కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల ఈ సినిమా కోసం ఒక సరికొత్త టెక్నిక్ ని వాడరట. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సినిమాలకి వాడిన పద్ధతిని శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాకి వాడినట్లు తెలుస్తోంది.

అదే స్పాట్ డబ్బింగ్. పవన్ కళ్యాణ్ తన "జానీ" మరియు "తీన్మార్" సినిమాలకి ఇదే స్పాట్ డబ్బింగ్ పద్ధతిని వాడారు. షూటింగ్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత సపరేట్ గా డబ్బింగ్ పనులు పూర్తి చేయడం కాకుండా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే స్పాట్ గా డబ్బింగ్ ఇవ్వడాన్ని స్పాట్ డబ్బింగ్ అంటారు. శ్రీనివాస్ అవసరాల ఈ సినిమా విషయంలో అదే పద్ధతిని వాడారు. ఈ సినిమా షూటింగ్ 2019 లోనే మొదలైంది. కానీ ఎన్నో కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా నాలుగేళ్ల తర్వాత ఈనెల 17వ తేదీన థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories