బాలయ్యకి విలన్ గా ఫ్యామిలీ హీరో ?

బాలయ్యకి విలన్ గా ఫ్యామిలీ హీరో ?
x
Boyapati sreenu
Highlights

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరీన్ నటిస్తుందని ముందుగా వార్తలు వచ్చాయి. ఆ తరవాత బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వీటిపైన చిత్ర యూనిట్ స్పందించింది లేదు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ను తీసుకునే ఆలోచనలో బోయపాటి ఉన్నట్టుగా తెలుస్తోంది.

హీరో శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ఇప్పటికే యుద్ధం శరణం సినిమాలో విలన్ గా కనిపించాడు. అంతేకాకుండా ఓ మలయాళ చిత్రంలోనూ విలన్ పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాలు శ్రీకాంత్ కి పెద్ద బ్రేక్‌ ని అయితే ఇవ్వలేదు. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీకాంత్ ని విలన్ గా చూపించాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు సాఫ్ట్, ఫ్యామిలీ కథలు చేసుకుంటూ వచ్చిన శ్రీకాంత్ బాలకృష్ణ పక్కన విలన్ గా ఎలా రాణిస్తాడు అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న..

ఫ్యామిలీ హీరోస్ ని విలన్ గా చూపించి సక్సెస్ కొట్టడం బోయపటికి పెద్ద విషయమేమీ కాదు. గతంలో లెజెండ్ సినిమాతో జగపతిబాబుని విలన్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు జగపతిబాబు టాప్ విలన్స్ లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అలాగే శ్రీకాంత్ కి కూడా విలన్ గా బ్రేక్ ఇచ్చే పనిలో ఉన్న్దాడట బోయపాటి. గతంలో శ్రీకాంత్,బోయపాటి దర్శకత్వం వహించిన సరైనోడు సినిమాలో నటించాడు.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం రూలర్ అనే సినిమాలో నటించాడు. క్రిస్మస్ పండగకి కానుకగా ఈ సినిమాని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కే. యస్ రవికుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ సినిమాని నిర్మించారు. వేదిక, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories