Sridevi Vijaykumar: 38 ఏళ్ల వయసులోనూ మెరుపు తగ్గని అందం.. అది శ్రీదేవికే సొంతం

Sridevi Vijaykumar
x

Sridevi Vijaykumar: 38 ఏళ్ల వయసులోనూ మెరుపు తగ్గని అందం.. అది శ్రీదేవికే సొంతం

Highlights

Sridevi Vijaykumar: శ్రీదేవి విజయ్ కుమార్. ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ శ్రీదేవి. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో ప్రశాస్ పక్కన హీరోయిన్‌గా నటించింది.

ఈ హీరోయిన్ తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం చాలా ఎక్కువ. ఆ రెండు మూడు సినిమాలకే తెలుగు ఇండస్ట్రీలో తన దైన ముద్రను వేసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ముందుకు వస్తోంది. అయితే ఇటీవల తన సొంత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

Sridevi Vijaykumar: శ్రీదేవి విజయ్ కుమార్. ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ శ్రీదేవి. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో ప్రశాస్ పక్కన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత నిరీక్షణ సినిమాలోనూ నటించింది. కానీ ఆ బ్యూటీకి అంతగా తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటెల్ అయిపోయింది.

తమిళంలో మంచి సినమాలు చేస్తూ కెరీర్‌‌ను టాప్‌లోకి తీసుకెళ్లింది. అదే సమయంలో రాహుల్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటెల్ అయింది. వీరికి రూపిక అనే ఒక పాప కూడా పుట్టింది. అయితే పెళ్లి తర్వాత శ్రీదేవి సినిమాలను పూర్తిగా మానేసింది. అయితే వీర సినిమాతో మళ్లీ మరొకసారి తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది.

తాజాగా ఇప్పుడు నారా రోహిత్ నటిస్తున్న సుందరకాండ సినిమాలో కథానాయికగా అవకాశం కొట్టేసింది.

అదేవిధంగా బుల్లి తెరపై పలు రియాల్టీ షోలలో జడ్జీగా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రీదేవి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలలో శ్రీదేవి దేవకన్యగా కనిపించింది. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం శ్రీదేవి వయసు 38 సంవత్సరాలు. అయితే ఇప్పటికీ అలా చిన్నపిల్లలా ఉండడానికి కారణం ఏంటంటే.. నిత్యం వ్యాయామం చేయడం, యోగా, వర్కవుట్స్‌ వంటి రెగ్యులర్‌‌గా చేస్తుంది. అదేవిధంగా ఇంట్లోనే మంచి భోజనం తయారు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories