అ సినిమాకి రజినీకాంత్ కంటే శ్రీదేవికే ఎక్కువ రెమ్యునరేషన్ ....

అ సినిమాకి రజినీకాంత్ కంటే శ్రీదేవికే ఎక్కువ రెమ్యునరేషన్ ....
x
Highlights

మాములు నటుడు నుండి సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు రజినీకాంత్ .. అలాగే బాలనటి నుండి మహిళా సూపర్ స్టార్ గా ఎదిగారు శ్రీదేవి .. వీరిద్దరూ తమిళంలో...

మాములు నటుడు నుండి సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు రజినీకాంత్ .. అలాగే బాలనటి నుండి మహిళా సూపర్ స్టార్ గా ఎదిగారు శ్రీదేవి .. వీరిద్దరూ తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో "మూండ్రు ముడిచ్చు" అనే సినిమాలో కలిసి నటించారు . అ సినిమాలో కమలహాసన్ కూడా నటించారు . ఇప్పుడు సినిమాల్లో హీరో, హీరోయిన్స్ రెమ్యునరేషన్ లక్షల్లో , కోట్లల్లో ఉంటుంది . అది కాకుంటే సినిమాల్లో లాభాలు తీసుకుంటున్నారు . కానీ అప్పట్లో సినిమా రెమ్యునరేషన్ కేవలం వేలల్లో మాత్రమే ఉండేది. మూండ్రు ముడిచ్చు సినిమాకి గాను శ్రీదేవి 5000 రెమ్యునరేషన్ తీసుకోగా రజీనికాంత్ 2000 రెమ్యునరేషన్ తీసుకున్నారు .

ఇక కమలహాసన్ 30.000 రెమ్యునరేషన్ తీసుకున్నారట . ఈ సినిమా 1976 విడుదల అయి మంచి విజయాన్ని అందుకుంది . అప్పటికే కమలహాసన్ మంచి పేరున్న నటుడుగా గుర్తింపు పొందారు .ఆ రకంగా ఆయనకి 30.000 రెమ్యునరేషన్ ఇస్తే తర్వాత శ్రీదేవికి 5000 రెమ్యునరేషన్, రజీనికాంత్ కి 2000 రెమ్యునరేషన్ ఇచ్చారట .. అంటే శ్రీదేవికన్నా రజినీకాంత్ కి మూడు వేల రెమ్యునరేషన్ తక్కువే ఇచ్చారన్నమాట. తర్వాతి కాలంలో రజీనికాంత్, శ్రీదేవి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు . మరో వైపు శ్రీదేవి బాలీవుడ్ లో తిరుగులేని నటిగా ఉన్నత స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories