Sreeleela: శ్రీలీలా నిజంగానే ఆ హీరోతో ప్రేమలో ఉందా.?

Sreeleela Really Dating Kartik Aaryan Rumors Spark After Family Party Appearance
x

Sreeleela: శ్రీలీలా నిజంగానే ఆ హీరోతో ప్రేమలో ఉందా.?

Highlights

Sreeleela: హీరోయిన్ల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలు వైరల్‌ అవ్వడం సర్వసాధారణమే.

Sreeleela: హీరోయిన్ల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలు వైరల్‌ అవ్వడం సర్వసాధారణమే. ముఖ్యంగా పలానా హీరోయిన్‌, పలాన హీరోతో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వార్తే బాలీవుడ్‌ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అందాల తార శ్రీలీల ప్రేమలో ఉందనేదే ఆ వార్త సారాంశం.

కార్తిక్‌ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమలో ఉందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కార్తిక్ ఫ్యామిలీ నిర్వహించిన ఒక ప్రైవేట్ పార్టీలో శ్రీలీల హాజరయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందంటూ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. ఇంతలోనే కార్తిక్ తల్లి ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఐఫా వేడుకల్లో పాల్గొన్న సమయంలో, నిర్మాత కరణ్ జోహార్ ఆమెను “మీ కోడలు ఎలా ఉండాలి అనుకుంటారు?” అని అడగ్గా, ఆమె “మంచి డాక్టర్ మా ఇంటికి కోడలిగా రావాలి” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

దీంతో శ్రీలీలా, కార్తిక్‌ ఆర్య నిజంగానే ప్రేమలో ఉన్నారన్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది. శ్రీలీల ఓవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ చదువుతోంది. ఇలాంటి తరుణంలో కార్తిక్ తల్లి ‘డాక్టర్ కోడలు’ అంశాన్ని ప్రస్తావించడంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కాగా దక్షిణాదిలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రీలీలా ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం పుట్టిందని టాక్ నడిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories