Single Movie Collections: థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతోన్న ప్రేక్ష‌కులు.. సింగిల్ క‌లెక్ష‌న్ల సునామి..!

Single Movie Collections: థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతోన్న ప్రేక్ష‌కులు.. సింగిల్ క‌లెక్ష‌న్ల సునామి
x

Single Movie Collections: థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతోన్న ప్రేక్ష‌కులు.. సింగిల్ క‌లెక్ష‌న్ల సునామి

Highlights

శ్రీ విష్ణు తాజా హాస్యభరిత చిత్రం ‘సింగిల్’ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ జోరుగా దూసుకుపోతోంది.

Single Movie Collections: శ్రీ విష్ణు తాజా హాస్యభరిత చిత్రం ‘సింగిల్’ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ జోరుగా దూసుకుపోతోంది. విడుదలైన మూడు రోజుల్లోనూ ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ, శ్రీ విష్ణు కెరీర్‌లోనే మరో బిగ్ హిట్‌గా నిలిచింది.

సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో గ్లోబల్‌గా రూ.16.3 కోట్లు వసూలైనట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మొదటి రోజు: ₹4.15 కోట్లు, రెండవ రోజు: ₹7.05 కోట్లు, మూడవ రోజు: ₹5.1 కోట్లు సాధించింది. కాగా ఈ సినిమా వారం రోజుల్లోపై రూ. 20 కోట్ల క్లబ్‌లో చేర‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ట్రేడ్ అనలిస్టులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బుక్ మై షోలో టికెట్ల హవా:

గత 24 గంటల్లోనే 66 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయని బుక్ మై షో పేర్కొంది. మొత్తం టికెట్లు 2 లక్షల మార్క్‌ను దాటేయడం విశేషం. అంతే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ మూవీ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. అమెరికాలో ఇప్పటికే $400K దాటేసిన ‘సింగిల్’, హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌ను చేరేందుకు వేగంగా పరుగులు తీస్తోంది.

ప్రత్యేకమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పించే శ్రీ విష్ణు, ఈ సినిమాలో తనదైన కామెడి టైమింగ్‌తో మరోసారి అలరించారు. ఆయన నటనకు తోడుగా వెన్నెల కిశోర్ చేసిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా, కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో, విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలసి కళ్యా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories