Kiran Abbavaram: పవన్ కళ్యాణ్ సినిమాలని 10 సార్లు చూసేవాడిని

Kiran Abbavaram: "రాజావారు రాణివారు" చిత్రంతో తెలుగు పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం ఇటీవల సోషల్ మీడియాలో

Sandeep Reddy
Updated on: 10 July 2021 4:04 PM IST
SR Kalyana Mandapam Movie Hero Kiran Abbavaram Says I Watched Pawan Kalyan Movies Above 10 Times
X

కిరణ్ ఆబ్బవరం మరియు పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Kiran Abbavaram - Pawan Kalyan: "రాజావారు రాణివారు" చిత్రంతో తెలుగు పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం ఇటీవల సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమాలను చూస్తూ పెరిగానని, తను పవర్ స్టార్ కి వీరాభిమానినని ఈ సందర్భంగా కిరణ్ తెలిపాడు. ప్రస్తుతం "ఎస్ఆర్ కళ్యాణ మండపం" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హీరో విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ నటుడిగా తన పరిణితి చూపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన "ఎస్ఆర్ కళ్యాణ మండపం" చిత్రంలోని విడుదలైన అన్ని పాటలు కోట్లల్లో వ్యూస్ తో సూపర్ హిట్ అవడంతో సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు ఆ టీం.

ఇక ఈ చిత్రంలో సాయి కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన కిరణ్ తను కాలేజీ రోజుల నుండి పవన్ కి అభిమానినని, పవన్ కళ్యాణ్ అన్ని చిత్రాలను ఒక్కొక్క చిత్రాన్ని 10 సార్లు చూశానని అవకాశం దొరికితే పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా కలుస్తానని కూడా ఈ యంగ్ హీరో తెలిపాడు. శ్రీధర్ గాదె దర్శకత్వంలో రాబోతున్న "ఎస్ఆర్ కళ్యాణ మండపం" చిత్రానికి కిరణ్ అబ్బవరం సొంతంగా కథని రాసుకొని ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story