SPIRIT: రెబల్ స్టార్ అభిమానులకు సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్ గిఫ్ట్!

SPIRIT: రెబల్ స్టార్ అభిమానులకు సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్ గిఫ్ట్!
x

SPIRIT: రెబల్ స్టార్ అభిమానులకు సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్ గిఫ్ట్!

Highlights

ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ను ‘అనిమల్’ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోతున్నారు.

ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ను ‘అనిమల్’ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం వంగా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి, కొత్త నటీ నటులను ఫైనల్ చేసే ప్రక్రియలో ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ ‘రాజసాబ్’, ‘ఫౌజీ’ షూటింగ్స్‌ను వేగంగా పూర్తి చేస్తూ, వీలైనంత త్వరగా ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్ళేలా సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అభిమానుల్లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

ఇక ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా, మేకర్స్ ‘స్పిరిట్’ నుండి ఒక క్రేజీ గిఫ్ట్‌ను విడుదల చేశారు. రెబల్ స్టార్ వాయిస్‌లోని చిన్న గ్లింప్స్ వీడియోలో – “Mr. Superintendent… childhood nunchi naaku okka bad habit undi – One Bad Habit” అన్న డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి నటించనుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే ప్రకాశ్ రాజ్, కాంచన (అర్జున్ రెడ్డి ఫేమ్) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా, భద్రకాళి పిక్చర్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రెబల్ ఫ్యాన్స్ మాత్రం ఒక్క మాటలో చెబుతున్నారు – “This is the Spirit we were waiting for!”

Show Full Article
Print Article
Next Story
More Stories