HBD NTR: 'బాల రాముడు' నుంచి యంగ్ 'కొమరం భీం' వరకు - ఎన్టీఆర్ జర్నీ..

‌Happy Birthday Junoir NTR
x

జూనియర్ ఎన్టీఆర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Happy Birthday NTR: నందమూరి నటవారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు జూనియర్‌ ఎన్టీఆర్‌.

Happy Birthday NTR: నందమూరి నటవారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. తన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్‌లతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారనండంలో సందేహం లేదు. తాత నందమూరి రామారావు కు తగ్గ మనవడిలా పేరు సంపాదించుకున్నాడు. నేడు (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హెచ్‌ఎంటీవీ (hmtvlive.com) శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు మే 20, 1983 లో జన్మించాడు జూనియర్ ఎన్టీఆర్. చిన్నప్పుడే కూచిపూడి నాట్యంలో ప్రతిభ కనబరిచి, పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.


తెలంగాణ సచివాలయం దగ్గరలోని 'విద్యారణ్య' హైస్కూల్‌లో చదివాడు.


తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులైన తాత సీనియర్ ఎన్టీఆర్.. 1991 లో 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో బాలనటుడిగా చిత్రసీమకు పరిచయం చేశారు.


ఈ తరువాత 1997 లో గుణశేఖర్ దర్శకత్వంలో 'బాల రామాయణం' సినిమాలో రాముడిగా నటించి, మెప్పించాడు. ఈ సమయంలో ఎన్‌.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.


ఇక హీరోగా 2001లో 'నిన్ను చూడాలని' సినిమాతో అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో 4 సినిమాలు పూర్తి చేశాడు.


ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ నెం.1' చిత్రంతో తొలి విజయం అందుకుని మంచి పేరు సాధించాడు.


వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఆది' సినిమాతో ఎన్టీఆర్‌లోని నటనను తారాస్ఠాయిలో చూపించారు. ఈ సినిమాతో ఎంతో మంది అభిమానులుగా మారారు.


2003లో మరోసారి రాజమౌళి తో జతకట్టి 'సింహాద్రి' సినిమాలో నటించాడు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచి, టాలీవుడ్‌లో ఎన్టీఆర్ తన సత్తా చాటారు. ఈ సినిమా విజయంతో అగ్ర నటులలో ఒకడిగా స్థానం సంపాధించాడు.


ఇక ఆతరువాత వరుస పరాజయాలు పలకరించాయి. 2007 లో ఎస్.ఎస్.రాజమౌళితో మరోసారి 'యమదొంగ' తో హ్యాట్రిక్ విజయం అందుకున్నాడు.


2015లో పురి జగన్నాద్ దర్శకత్వంలో డైరెక్షన్‌ లో వచ్చిన 'టెంపర్' తో ఘన విజయాన్ని అందుకుని, ఈ చిత్రంలో అద్భుత నటన కనబరచినందుకుగాను పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.


ఇక తన 25వ సినిమాగా 2016లో సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో..' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఎన్టీఆర్. ఈ చిత్రంలో ఢిపరెంట్ గెటప్ తో కనిపించి సందడి చేశాడు. ఈ గెటప్ ని కొన్ని లక్షల మంది అనుసరించేలా చేశాడు. అలాగే ఫోర్బ్స్ మోస్ట్ డిసైరబుల్ మెన్-2015లో రెండో స్థానాన్ని సంపాధించాడు. 2016 సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించి50 కోట్ల క్లబ్ లో చేరింది.


'నాన్నకు ప్రేమతో' (2016), 'జనతా గ్యారేజ్'(2016), 'జై లవకుశ'(2017), 'అరవింద సమేత వీరరాఘవ' (2018) సినిమాలతో వరుసగా ఐదు విజయాలను అందుకుని తన స్టామినా చూపించాడు.


ఎన్టీఆర్‌ ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలు ఇచ్చిన రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ సినిమాగా 'ఆర్ఆర్ఆర్' పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్.. కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు.


అలాగే తన 30 వ సినిమాను 'జనతా గ్యారేజ్' వంటి హిట్ అందించిన కొరటాల శివతో చేయనున్నాడు.


ఇక ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఇప్పటివరకు 2 నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతోపాటు 4 సినిమా అవార్డులు అందుకున్నాడు.


2018 లో ఫోబ్స్‌ విడుదల చేసిన హైఎస్ట్‌ పెయిడ్ యాక్టర్స్‌లో 28వ స్థానంలో నిలిచాడు.


ఇప్పటి వరకు 21 మంది డైరెక్టర్లతో పనిచేశాడు. ఇందులో ఒక్క రాజమౌళితోనే 4 సనిమాలు చేశాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories