లతాజీ క్షేమంగా ఉన్నారు... అసత్య కథనాలు నమ్మకండి : ఎస్పీ బాలు

lata mangeshkar
x
lata mangeshkar
Highlights

ప్రముఖ గాయని భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల వదందులు వస్తున్నాయి.

ప్రముఖ గాయని భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల వదందులు వస్తున్నాయి. అనారోగ్య కారణంతో ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె శ్వాసతీసుకోవటంలో ఇబ్బందులు ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు అత్యుత్సాహంతో ఆమె మరణించిందని అసత్య కథనాలు పోస్ట్ చేస్తున్నారు.

దీనిపై గాన గంధర్వుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం రాత్రి ఫేస్‌బుక్‌ పేజ్‌లో స్పందించారు. లతా మంగేష్కర్‌గారి ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు ఎంతో దారుణంగా ఉన్నాయాని, లతాజీ ఆరోగ్యంపై కొందరు వ్యక్తులు సమాచారం లేకుండా తప్పుడు పోస్టులు పెడుతున్నారు. నేను లతాజీ ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకున్న ఆమె ఆరోగ్యం కుదుట పడింది, తర్వగా కోలుకుంటున్నారు. ఆమె బాగుండాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు

అయితే ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్న సమాచారం లేకుండా తప్పుడు వార్తలు షేర్ చేయకండి. పుకార్లు నమ్మకండి అంటూ ఫేస్ బుక్ లో వీడియో పోస్టు చేశారు. అసత్య వార్తలపై లతా మంగేష్కర్‌ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. దీంతో బాలసుబ్రహ్మణం స్పందించి లతాజీ కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్‌ అవుతారని వెల్లడించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories