Sequel Season: సౌత్‌లో రానున్న బిగ్ సీక్వెల్స్

South gears up for big sequel season
x

సౌత్‌లో రానున్న బిగ్ సీక్వెల్స్ (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

Sequel Season: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవల "దృశ్యం 2" అనే సస్పెన్స్ డ్రామాతో సందడి చేశాడు.

Sequel Season: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవల "దృశ్యం 2" అనే సస్పెన్స్ డ్రామాతో సందడి చేశాడు. ఈ చిత్రాన్ని ఓటీటీలో (OTT) విడుదల చేశారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్ వచ్చింది. ప్రీక్వెల్ లాగే సీక్వెల్ కూడా విజయం సాధించడంతో మిగతా భాషల్లోనూ రిమేక్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దక్షిణాదిలో సీక్వెల్స్ సీజన్ కొనసాగుతోందని స్పష్టంగా తెలుస్తుంది. అభిమానులను అలరించేందుకు సౌత్ ఇండస్ట్రీలో నాలుగు పెద్ద సీక్వెల్స్ రానున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర నిర్మాతలు- దర్శకులు ఇటీవలి కాలంలో బ్లాక్ బస్టర్స్ అయిన చిత్రాల సీక్వెల్స్ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఎక్కువ సీక్వెల్స్ యాక్షన్, థ్రిల్లర్ జానర్ లోనే ఉన్నాయి. కోవిడ్ -19 తరువాత బాక్సాఫీస్ వద్ద చాలా చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటున్న తరుణంలో చిత్ర నిర్మాతలు - దర్శకులు సీక్వెల్స్ త్వరగా తీసుకొచ్చేందుకు ఆరటపడుతున్నారు. దక్షిణాదిలో రాబోయే కొద్ది నెలల్లో విడుదల కాబోయే సీక్వెల్స్ చూద్దాం..

హిట్ 2(HIT 2)

నటుడు నాని నిర్మించే "హిట్ 2" సినిమా.. విశ్వక్ సేన్ నటించిన "హిట్: ది ఫస్ట్ కేస్" కు కొనసాగింపుగా రానుంది. ఈ సీక్వెల్ లో అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. "కేడీ మాదిరిగానే, అడివి శేష్ కృష్ణ దేవ్ లా రానున్నాడు. డబుల్ బాదాస్, వెల్‌కమ్ ఆన్‌బోర్డ్ ఆఫీసర్" అంటూ హీరో నాని ఇటీవలే ట్విట్టర్ లో ప్రకటించారు.


గూడాచారి 2 (Goodachari 2)

అడివి శేష్ నటించే ఈ తెలుగు చిత్రం 2018 విడుదలైన స్పై థ్రిల్లర్ "గూడాచారి" కి సీక్వెల్. అడివి శేష్ ప్రస్తుతం "మేజర్" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత గూడాచారి 2 ప్రారంభిస్తామని వివరణ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. "స్క్రిప్ట్ చాలా బలంగా ఉందని, అలాగే ప్రీక్వెల్ లానే అంచనాలను అందుకుంటుందని భావిస్తున్నాం. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభిస్తాం" అని శేష్ పేర్కొన్నారు.


రాట్సాసన్ 2 (Ratsasan 2)

2018 లో విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ "రాట్సాసన్" కు కొనసాగింపుగా సీక్వెల్ తయారు చేసే పనిలో దర్శకుడు రామ్ కుమార్ పనిచేస్తున్నట్లు నటుడు విష్ణు విశాల్ వెల్లడించాడు. అయితే ప్రస్తుతానికి షూటింగ్ పై ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. ఈ హిట్ ఫెయిర్ సీక్వెల్ కు సిద్ధమైనట్లు మాత్రం తెలుస్తోంది.

కేజీఎఫ్: చాప్టర్ 2 (KGF: Chapter 2)

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ ను గ్యాంగ్ స్టర్ రాకీగా చూపించిన కేజీఎఫ్: చాప్టర్ 1 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2018 బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రీక్వెల్ లో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ ప్రముఖ పాత్రలలో నటించిన విషయం విదితమే.


ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (F3: Fun and Frustration)

ఇక తెలుగులో "ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2019లో వచ్చిన ఈ కామెడీ డ్రామా కి సీక్వెల్ ఇప్పటికే ప్లాన్ చేశారు. నటులు వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు మరలా ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 27 న విడుదల కానుంది.


ఇవే కాకుండా, తమిళ చిత్రాలు "వడా చెన్నై 2", "కైతి 2" కూడా చర్చల్లో ఉన్నాయని తెలుస్తోంది. అయితే, వీటిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories