Sonu Sood: పుట్టినరోజు సందర్భంగా ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టిన సోను సూద్... ప్రశంసల వెల్లువ

Sonu Sood
x

Sonu Sood: పుట్టినరోజు సందర్భంగా ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టిన సోను సూద్... ప్రశంసల వెల్లువ

Highlights

Sonu Sood: సోను సూద్ మంచి నటుడిగా, ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా అందరికీ సుపరిచితుడే. కానీ, ఆయనలోని గొప్ప సమాజ సేవకుడు కోవిడ్ సమయంలోనే బయటపడ్డాడు. ఆ సమయంలో ఆయన చేసిన సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.

Sonu Sood: సోను సూద్ మంచి నటుడిగా, ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా అందరికీ సుపరిచితుడే. కానీ, ఆయనలోని గొప్ప సమాజ సేవకుడు కోవిడ్ సమయంలోనే బయటపడ్డాడు. ఆ సమయంలో ఆయన చేసిన సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ప్రజలు ఆయన్ను అవతార పురుషుడు అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. కోవిడ్ తర్వాత కూడా సోను సూద్ తన సామాజిక సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. జులై 30న సోను సూద్ తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వృద్ధుల కోసం ఒక భారీ వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని ఆయన ప్రకటించారు.

సోను సూద్ నిర్మించబోయే ఈ వృద్ధాశ్రమం కనీసం 500 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించనుంది. ఇది కేవలం వృద్ధులకు ఒక ఆశ్రయం మాత్రమే కాదు, వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. వృద్ధుల ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఆధ్యాత్మిక మందిరం కూడా ఉంటుంది. పార్కులు, వినోద విభాగం కూడా ఏర్పాటు చేస్తారు. వృద్ధులు తమ చివరి రోజులను ప్రశాంతంగా, సంతోషంగా గడపడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సోను సూద్ ఈ వృద్ధాశ్రమంలో చేయనున్నారు.

సోను సూద్ చేసిన సామాజిక సేవలకు దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ కొత్త నిర్ణయానికి కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ వృద్ధాశ్రమాన్ని సోను సూద్ తన సొంత ఫౌండేషన్ ద్వారా నిర్మించనున్నారు. ఆయన కేవలం తన రాష్ట్రానికే కాకుండా, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు సహాయం చేశారు. బుధవారం సోను సూద్ పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, ఆయన సేవా గుణాన్ని ప్రశంసించారు.

కోవిడ్ ముందు సోను సూద్ ఎక్కువగా విలన్ పాత్రలు చేసేవారు. చాలా బిజీగా ఉండేవారు. కానీ, సామాజిక సేవలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనకు విలన్ పాత్రలు రావడం తగ్గిపోయాయి. ఇప్పుడు ఆయన సినిమాలు పెద్దగా చేయడం లేదు. ఈ ఏడాది ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన 'ఫతేహ్' సినిమా విడుదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories