Sonu Sood: ఫిష్‌ వెంకట్‌ కుటుంబాన్ని పరామర్శించిన రియల్‌ హీరో

Sonu Sood: ఫిష్‌ వెంకట్‌ కుటుంబాన్ని పరామర్శించిన రియల్‌ హీరో
x

Sonu Sood: ఫిష్‌ వెంకట్‌ కుటుంబాన్ని పరామర్శించిన రియల్‌ హీరో

Highlights

బాలీవుడ్‌ నటుడు, రియల్‌ హీరోగా పేరొందిన సోను సూద్ మరోసారి తన మనసున్న మనిషిగా నిరూపించుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన టాలీవుడ్‌ నటుడు ఫిష్‌ వెంకట్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు సోను సూద్ స్వయంగా హైదరాబాద్‌ వచ్చారు.

బాలీవుడ్‌ నటుడు, రియల్‌ హీరోగా పేరొందిన సోను సూద్ మరోసారి తన మనసున్న మనిషిగా నిరూపించుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన టాలీవుడ్‌ నటుడు ఫిష్‌ వెంకట్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు సోను సూద్ స్వయంగా హైదరాబాద్‌ వచ్చారు. కుకట్‌పల్లి అడ్డగుట్టలో ఉన్న ఫిష్‌ వెంకట్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకుని ధైర్యం చెప్పారు.

ఫిష్‌ వెంకట్‌ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో ఉందని తెలిసిన వెంటనే సోను సూద్ లక్ష రూపాయల సాయం అందజేశారు. ఈ మొత్తాన్ని బ్యాంక్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసిన అనంతరం ఆయన స్వయంగా కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు.

వారితో కాసేపు ముచ్చటించి, ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఫిష్‌ వెంకట్‌ టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్నారు. ‘అదుర్స్‌’, ‘గబ్బర్ సింగ్’, ‘ఖైది నంబర్ 150’, ‘శివం’ వంటి చిత్రాల్లో విలన్‌గా, సహాయ పాత్రల్లో మంచి గుర్తింపు పొందారు.

కరోనా సమయంలో సోను సూద్‌ పేద ప్రజలకు ఆర్థిక సహాయం, ఆక్సిజన్ సరఫరా, ఉచిత వైద్యం, విద్యార్థులకు మద్దతు, విదేశాల్లో చిక్కుకున్న వారిని సొంతంగా ఏర్పాటు చేసిన విమానాల్లో దేశానికి రప్పించడం వంటి సేవలతో రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నటీనటులకూ ఆయన తోడుగా నిలుస్తున్నారు.

ఈ ఘటనతో సోను సూద్ సహనుభూతి, మానవత్వాన్ని మరోసారి చాటిచెప్పారు.



Show Full Article
Print Article
Next Story
More Stories