విశ్వక్ సేన్ మరియు నివేదా పెతురాజ్ ల మధ్య ఏం జరుగుతోంది?

* బోల్డ్ సన్నివేశాలలో కూడా నివేదా పెతురాజ్ చాలా ఈజ్ తో నటించటంతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తోంది.

R Tripura Malini
Published on: 20 Nov 2022 9:54 AM IST
something brewing between vishwak sen and nivetha pethuraj
X

విశ్వక్ సేన్ మరియు నివేదా పెతురాజ్ ల మధ్య ఏం జరుగుతోంది?

Vishwak And Nivetha: యువ హీరో విశ్వక్ సేన్ మరియు హీరోయిన్ నివేదా పెతురాజ్ మధ్య ఏదో ఉందని ఇప్పటికే పలుసార్లు పుకార్లు వినిపించాయి. కానీ ఇద్దరు తమ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఓపెన్ అప్ అవలేదు. తాజాగా "ధంకీ" సినిమా ట్రైలర్ చూస్తే వీరి గురించి వస్తున్న పుకార్లు అన్నీ నిజమేనేమో అని సందేహాలు వస్తున్నాయి. ఇప్పటిదాకా కేవలం నాన్ గ్లామరస్ పాత్రలలో మాత్రమే కనిపించిన నివేత సడన్ గా "ధంకీ" సినిమాలో సరికొత్త అవతారాన్ని చూపించడంతో అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. ఇక సినిమా ట్రైలర్ లో విశ్వక్ మరియు నివేదా పెతురాజ్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే వీరిద్దరూ నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారేమో అని సందేహం మొదలవుతుంది.

బోల్డ్ సన్నివేశాలలో కూడా నివేదా పెతురాజ్ చాలా ఈజ్ తో నటించటంతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తోంది. ఇక ఈ పుకార్లపై విశ్వక్ లేదా నివేదా పెతురాజ్ లు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి "పాగల్" అనే సినిమాలో నటించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రం గానే నిలిచింది తాజాగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి "దస్ కా ధంకీ" అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. విశ్వక్ సేన్ స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. రెండుసార్లు కలిసి నటించడం వల్ల మాత్రమే వీరిద్దరి మధ్య ఇలాంటి పుకార్లు వస్తున్నాయా లేక వీరిద్దరి మధ్య నిజంగానే ఏమైనా నడుస్తుందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు "దస్ కా ధంకీ" సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కు సిద్ధం అవుతుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story