Solo Brathuke So Better: 'సోలో బ్రతుకే సో బెటర్' మొదటి మూడు రోజుల కలెక్షన్స్

Solo Brathuke So Better: సోలో బ్రతుకే సో బెటర్ మొదటి మూడు రోజుల కలెక్షన్స్
x
Highlights

సాయితేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన 'సోలో బ్రతుకే సో బెటర్' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్స్‌లో విడుదలైంది.

కరోనా కారణంగా చాలా కాలం పాటు సినిమాలు ఏవీ థియేటర్లో రిలీజ్ కాలేదు. అయితే సాయితేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన 'సోలో బ్రతుకే సో బెటర్' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్స్‌లో విడుదలైంది. తొమ్మిది నెలల తర్వాత థియేటర్స్‌లో విడుదలైన తెలుగు సినిమా కూడా ఇదే. కరోనా నిబంధనలని పాటిస్తూ.. వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా థియేటర్ అనుభూతి కోసం ప్రేక్షకులు ఆ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తొలిరోజు 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు కూడా 3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దర్శక నిర్మాతలలో కొత్త ఉత్సాహం నింపింది.

ఇకపోతే మూడో రోజు సైతం ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. 'సోలో బ్రతుకే సో బెటర్' మూడోరోజు కూడా 3 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. దాంతో మూడు రోజుల్లో ఈ సినిమా 10 కోట్లకు పైగా గ్రాస్, 6 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అదిరిపోయే కలక్షన్స్ సొంతం చేసుకుంటుంది.

ఈ చిత్రం విడుదలైన మూడో రోజు కూడా భారీ వసూళ్ళు సాధించడంతో దర్శక నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 10 కోట్లు రూపాయలు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ దాటడంతో బ్రేక్ ఈవెన్‌కు చేరువగా వచ్చింది ఈ చిత్రం. ఇప్పుడు మరో నాలుగు రోజులు ఇవే వసూళ్లు వస్తే సినిమా బయటపడినట్లే. ఇప్పటికే జీ స్టూడియోస్‌ ఈ సినిమా హక్కులను కోనుగోలు చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories