Actress: అయ్య బాబోయ్‌.. 'స్నేహగీతం' బ్యూటీ ఇలా మారిందేంటి? గ్లామర్‌తో అరాచకం

Sneha geetham fame Shreya Dhanwanthary latest photos goes viral
x

Actress: అయ్య బాబోయ్‌.. 'స్నేహగీతం' బ్యూటీ ఇలా మారిందేంటి? గ్లామర్‌తో అరాచకం

Highlights

Shreya Dhanwanthary: హీరోలతో పోల్చితే హీరోయిన్లు తెరపై కొన్ని రోజులే క్రీయాశీలకంగా ఉంటారు.

Shreya Dhanwanthary: హీరోలతో పోల్చితే హీరోయిన్లు తెరపై కొన్ని రోజులే క్రీయాశీలకంగా ఉంటారు. ఎన్ని హిట్స్‌ అందించిన హీరోయిన్లు అయినా సరే ఒకానొక సమయం తర్వాత తెరమరుగుకావాల్సిందే. ఇప్పటి వరకు సౌత్‌లో అలా స్టార్‌ హీరోయిన్‌ హోదాను దక్కించుకున్న బ్యూటీలు ప్రస్తుతం తెరపై కనిపించడం లేదు. అయితే సోషల్‌ మీడియా పుణ్యామాని సినిమాలకు దూరమైనా నెట్టింట సందడి చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. అలాంటి ఓ హీరోయిన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2010లో వచ్చిన స్నేహగీతం మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా యువతను ఈ సినిమా ఎక్కువగా ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారనే సందీప్‌ కిషన్‌ హీరోగా వెండి తెరకు పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమాలో సుందీప్ కిషన్‌తో పాటు సుహాని కలిత, చైతన్య కృష్ణ, రియా, వెంకీ అట్లూరి వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది అందాల భామ శ్రేయా ధన్వంథరి.

హైదరాబాద్‌లో జన్మించిన శ్రేయా ధన్వంతరి, ఢిల్లీ నగరంలో పెరిగింది. ఈ బ్యూటీ విద్యాభ్యాసం విషయానికొస్తే వరంగల్‌ నిట్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రేయా.. స్నేహగీతం కంటే ముందు జోష్‌ సినిమాలో నటించింది. అయితే స్నేహగీతం తర్వాత ఈ బ్యూటీ మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లో నటించి మెప్పించింది. స్కామ్‌ 1992లో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది.

సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్‌ మీడియా వేదికగా రచ్చ చేస్తుందీ బ్యూటీ. ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. తెలుగులో నటించిన సమయంలో చాలా ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించిన ఈ చిన్నది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మాత్రం గ్లామరస్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాను వేడెక్కిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బ్యూటీ ఇప్పుడెలా మారిందో మీరూ చూసేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories