Prince Movie: "ప్రిన్స్" ను 12 నిమిషాలు ట్రిమ్ చేసిన చిత్ర బృందం

Prince Movie: "ప్రిన్స్" సినిమాలో 12 నిమిషాల పై కత్తెర

Rama Rao
Published on: 20 Oct 2022 8:24 PM IST
Sivakarthikeyans Prince Movie has been Trimmed By 12 Minutes
X

Prince Movie: "ప్రిన్స్" ను 12 నిమిషాలు ట్రిమ్ చేసిన చిత్ర బృందం

Prince Movie: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. "వరుణ్ డాక్టర్" వంటి సినిమాతో హిట్ అందుకున్న శివ త్వరలోనే "ప్రిన్స్" అనే సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "జాతిరత్నాలు" ఫేమ్ దర్శకుడు అనుదీప్ కే వీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉక్రేనియన్ నటి మారియా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.

దీపావళి సందర్భంగా ఈ నెల 21న "ప్రిన్స్" సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మధ్యనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ యు సర్టిఫికేట్ న అందుకుంది. మొదట, సినిమా రన్‌టైమ్ 2 గంటల 23 నిమిషాలు ఉందట. కానీ చిత్ర బృందం రన్ టైం ను 12 నిమిషాలను ట్రిమ్ చేసింది. ఇప్పుడు కొత్త రన్‌టైమ్ 2 గంటల 11 నిమిషాలు అని సమాచారం.

మొదటి హాఫ్ 1 గంట 7 నిమిషాల 19 సెకన్లు కాగా రెండవ హాఫ్ 1 గంట 3 నిమిషాలు మరియు 45 సెకన్లు ఉంటుందట. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ, "ప్యాన్ ఇండియా సినిమాలు, ద్విభాషా సినిమాలు ఈ మధ్య చాలానే వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తుండగా, రామ్ చరణ్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ నా మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా. భవిష్యత్తులో మరిన్ని ద్విభాషా సినిమాలు చేయాలనుకుంటున్నాను,'' అని అన్నారు శివ కార్తికేయన్.

Rama Rao

Rama Rao

Next Story