ప్రిన్స్ కి శివ కార్తికేయన్ సెట్ అవ్వలేదా?

Sivakarthikeyan is not Set for Prince?
x

ప్రిన్స్ కి శివ కార్తికేయన్ సెట్ అవ్వలేదా?

Highlights

అందుకే ప్రిన్స్ సినిమా ఫ్లాప్ అయింది అంటున్న అభిమానులు

Sivakarthikeyan: "పిట్ట గోడ" అనే సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన అనుదీప్ కేవి "జాతి రత్నాలు" సినిమాతో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. కరోనా తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచిన "జాతి రత్నాలు" సినిమా రికార్డు సృష్టించింది. ఎటువంటి అంచనాలు లేకుండానే విడుదలై ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇండస్ట్రీలో అనుదీప్ పేరు మారుమ్రోగిపోయింది. తాజాగా ఇప్పుడు అనుదీప్ కేవి తమిళ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా "ప్రిన్స్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

దివాళి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుతుంది. నిజానికి "జాతి రత్నాలు" సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణాలలో మొదటిది కాస్టింగ్. నటినటుల కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుండటం సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. "ప్రిన్స్" విషయంలో కూడా అనుదీప్ అంతే ఫన్ జనరేట్ చేయాలని ప్రయత్నించారు కానీ అటు తెలుగులో మాత్రమే కాక ఇటు తమిళ్ లో కూడా సినిమా హిట్ అవ్వలేదు. చాలామంది శివ కార్తికేయన్ ఈ సినిమాకి సరైన ఛాయిస్ కాదని చెబుతున్నారు. శివ కార్తికేయన్ స్థానంలో తెలుగు హీరో ఉండి ఉంటే సినిమా కనీసం హిట్ అయ్యేదని వారి అభిప్రాయం. ఇక శివ కార్తికేయన్ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. పూర్తి తెలుగు ఓరియంటేషన్ ఉన్న సినిమా అయ్యుంటే బాగుండేదని శివ కార్తికేయన్ అభిమానులు సైతం ఒప్పుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories