Adipurush: సీతగా కృతి సనన్ ఎలా ఉందంటే.. వైరల్ అవుతున్న నెటిజన్స్ కామెంట్స్..

Adipurush: సీతగా కృతి సనన్ ఎలా ఉందంటే.. వైరల్ అవుతున్న నెటిజన్స్ కామెంట్స్..

Arun Chilukuri
Updated on: 29 April 2023 3:00 PM IST
Sita First Look From Prabhas Adipurush Released
X

Adipurush: సీతగా కృతి సనన్ ఎలా ఉందంటే.. వైరల్ అవుతున్న నెటిజన్స్ కామెంట్స్..

Sita First Look From Prabhas Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఆది పురుష్, ప్రాజెక్ట్ K, సలార్, రాజా డీలక్స్, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి. ఆదిపురుష్ 550 కోట్లతో, ప్రాజెక్ట్ K 500 కోట్లు, సలార్ 250 కోట్లు, రాజా డీలక్స్ 200 కోట్లు, స్పిరిట్ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్ లో చేసిన ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా ఫిలిమ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ కు సంబంధించి గతంలో విడుదల చేసిన ట్రైలర్ పై చాలా విమర్శలు వచ్చాయి. ప్రధానంగా రావణాసురుడి పాత్రలో సైఫ్ కనిపించిన తీరుపై కామెంట్స్ వెల్లువెత్తాయి. భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమాని నాసిరకం గ్రాఫిక్స్ తో చూపిస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ గరమ్ అయ్యారు. దీంతో అప్రమత్తమైన ఆదిపురుష్ టీమ్ గ్రాఫిక్స్ పై మరింత వర్క్ చేసింది. దీంతో గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సిన ఆదిపురుష్ ఎట్టకేలకు జూన్ 16న విడుదలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇస్తూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన పోస్టర్, రీసెంట్ గా వచ్చిన మోషన్ పోస్టర్, జై శ్రీరామ్ సాంగ్ ఇలా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతిఒక్కటీ సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. అలాగే ట్రైలర్ ను 3 నిమిషాల 22 సెకండ్ల రన్ టైంలో విడుదల చేస్తామని చెప్పి ప్రభాస్ అభిమానులు, ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. మొత్తంగా, గ్రాఫిక్స్ విషయంలో మొదట్లో విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ టీమ్ ఇప్పుడు ప్రశంసలను రాబట్టుకుంటోంది. ఇక తాజాగా సినిమాలో సీతమ్మ పాత్రను పోషిస్తున్న కృతి సనన్ లుక్ ని హైలైట్ చేస్తూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

అపహరణకు గురైన సీతమ్మ తన భర్త రాముడి రాక కోసం ఎదురు చూస్తూ కన్నీరు కారుస్తున్న మోషన్ పోస్టర్ అందరి హృదయాలను హత్తుకునే విధంగా ఉంది. కృతి సనన్ తన ముఖంలో వేదనను, నిరీక్షణను అద్భుతంగా పలికించింది. లెటెస్ట్ లుక్ చూశాక సీతగా కృతి సనన్ బెస్ట్ ఛాయిస్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఆదిపురుష్ విజయం సాధిస్తుందని నమ్మకం కలిగిచావంటూ ఓం రౌత్ ను ప్రశంసిస్తున్నారు కూడా. మొత్తానికి, బాహుబలి2 తర్వాత ప్రభాస్ కు హిట్ పడలేదు. ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story