Sirai OTT Review: హార్ట్ టచింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా కదిలిస్తున్న తమిళ మూవీ "సిరై"

Sirai OTT Review
x

Sirai OTT Review 

Highlights

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ చిత్రం సిరై తెలుగులో ప్రేక్షకులను కదిలిస్తోంది. హార్ట్ టచింగ్ లవ్, క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటున్న పూర్తి రివ్యూ.

Sirai OTT Review: ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారిన తమిళ చిత్రం ‘సిరై’ ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను కదిలిస్తోంది.

విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘సిరై’ చిత్రం జనవరి 23న ఓటీటీలోకి రాగా, జనవరి 26 నుంచి తెలుగులో అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

కథలో కదిరవన్ అలియాస్ శ్రీను అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో విక్రమ్ ప్రభు నటించారు. నిజాయతీగా విధులు నిర్వహించే అతడికి, హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న అబ్దుల్ రౌఫ్‌ను కోర్టుకు తీసుకెళ్లే బాధ్యత అప్పగిస్తారు. అయితే మార్గమధ్యంలో ఖైదీ తప్పించుకోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కథను మలుపుతిప్పుతాయి.

అబ్దుల్ నిర్దోషి అని కదిరవన్ గ్రహించే క్రమంలో, న్యాయవ్యవస్థలోని లోపాలు, మతభేదాల మధ్య ప్రేమ, తల్లి–ప్రేమిక మధ్య సంఘర్షణ వంటి అంశాలు భావోద్వేగంగా ఆవిష్కృతమవుతాయి. అబ్దుల్–కలైయరసి ప్రేమకథ ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది.

నటీనటుల ప్రదర్శన ఈ సినిమాకు ప్రధాన బలం. విక్రమ్ ప్రభు పోలీస్ పాత్రలో సహజమైన నటనతో మెప్పించగా, అబ్దుల్ పాత్రలో అక్షయ్ కుమార్ హృదయాన్ని కదిలించే నటన కనబరిచారు. అనిష్మ అనిల్ కుమార్ కీలక సన్నివేశాల్లో ప్రభావవంతంగా నటించారు.

దర్శకుడు సురేష్ రాజకుమారి కథను పక్కాగా స్క్రీన్‌పైకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. మొత్తం మీద ‘సిరై’ ఓ భావోద్వేగ క్రైమ్ థ్రిల్లర్‌గా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories