Yasaswi: ఎన్జీవో వివాదంలో ఇరుక్కున్న సరిగమప ఫేమ్ యశస్వి..

Singer Yasaswi Lands In Controversy
x

Yasaswi: ఎన్జీవో వివాదంలో ఇరుక్కున్న సరిగమప ఫేమ్ యశస్వి..

Highlights

Yasaswi: వివాదంలో ఇరుక్కున్న సరిగమప సింగర్

Yasaswi: సరిగమప సింగింగ్ షోలో శర్వానంద్ మరియు సమంత హీరో హీరోయిన్లుగా నటించిన "జాను" సినిమా లో నుండి లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటను పాడిన యశస్వి తన గొంతుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు యశస్వి. అంతేకాకుండా తన మధురమైన గాత్రంతో సరిగమప సింగింగ్ ఐకాన్ టైటిల్ కూడా గెలిచేసాడు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సెలబ్రిటీ స్టేటస్ ను అందుకున్నాడు యశస్వి.

అయితే ఫేమ్ తో పాటు ఇండస్ట్రీలో నెగెటివిటీ కూడా వస్తుంది. అదే విధంగా యశస్వి కూడా ఇప్పుడు ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. తనది కానీ స్వచ్ఛంద సంస్థను తానే నడుపుతున్నట్లు చెప్పుకొని మోసం చేస్తున్నాడు అని ఒక ఫౌండేషన్ వారు ఆరోపణలు చేస్తున్నారు. తన సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకొని చీటింగ్ చేస్తున్నాడు అని నవసేవ ఫౌండేషన్ నిర్వాహకురాలు కౌసర్ కంప్లైంట్ చేశారు. ఇటీవల ఒక షో లో పాల్గొన్న యశస్వి నవసేవ అనే పేరుతో తాను ఒక ఎన్జీవో ని నడుపుతున్నట్లు అందులో 50 నుంచి 60 మంది పిల్లలు కూడా చదివిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

అయితే అది ఏ మాత్రం నిజం కాదని ఆ సంస్థను నడుపుతున్నది తానేనని కౌసర్ ఆరోపిస్తున్నారు. "గత ఐదు సంవత్సరాలుగా నవ సేవ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాధ పిల్లలను చదివిస్తున్నది నేను. కానీ సింగింగ్ షోలో ఓట్లు తెచ్చుకోవడానికి నవసేవ తానే నడిపిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు యశస్వి. ఈ విషయం తెలిసి నేను అతన్ని స్వయంగా కలిశాను కానీ అతడు పట్టించుకోలేదు," అన్న కౌసర్ సదురు టీవీ ఛానల్ మరియు యాంకర్ పై కూడా చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories